గురూజీ పూజను వదిలేలా లేడు?

prashanth musti   | Asianet News
Published : Feb 21, 2020, 01:18 PM IST
గురూజీ పూజను వదిలేలా లేడు?

సారాంశం

వరుసగా అవకాశాలు అందుకుంటున్న హాట్ బ్యూటీ పూజా హెగ్డే. స్టార్ హీరో ఎవరైనా సరే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు అంటే.. ముందుగా పూజా ప్రస్తావన వస్తోందట. అంతగా క్రేజ్ పెంచుకున్న ఈ బుట్టబొమ్మపై మరోసారి గురూజీ కర్చీఫ్ వేసినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటున్న హాట్ బ్యూటీ పూజా హెగ్డే. స్టార్ హీరో ఎవరైనా సరే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు అంటే.. ముందుగా పూజా ప్రస్తావన వస్తోందట. అంతగా క్రేజ్ పెంచుకున్న ఈ బుట్టబొమ్మపై మరోసారి గురూజీ కర్చీఫ్ వేసినట్లు తెలుస్తోంది. తన తదుపరి సినిమాకు కూడా పూజను హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకోవాలని చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా కనిపించిన విషయం తెలిసిందే. ఆమెలో యాక్టింగ్ టైమింగ్ ని మెచ్చిన గురూజీ వెంటనే 'అల.. వైకుంఠపురములో' సినిమాకు కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. సెకండ్ టైమ్ బ్యూటీ గ్లామర్ సినిమాకు మంచి కలరింగ్ తేవడంతో మూడవసారి కూడా మాటల మాంత్రికుడు ఆమెను తారక్ కి జోడిగా చూపించబోతున్నాడని వినికిడి.  ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

అయితే త్రివిక్రమ్ తన సినిమాల్లో ఇంతవరకు ఇలియానా - సమంతలను మాత్రమే రిపీట్ చేశాడు. ఫామ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ తోనే ఎక్కువగా వర్క్ చేస్తుంటారు అనేది ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. ఇక హీరోయిన్స్ కథతో సంబంధం లేకుండా త్రివిక్రమ్ అంటే చాలు సినిమా చేయడానికి వెంటనే ఒప్పేసుకుంటారు., మరీ ఎన్టీఆర్ తో చేయబోయో నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?