'నెలసరి సమయంలో భర్తలకు వంటచేస్తే కుక్కలుగా పుడతారు' చెత్త వ్యాఖ్యలపై మండిపడ్డ హీరోయిన్!

Published : Feb 21, 2020, 12:50 PM IST
'నెలసరి సమయంలో భర్తలకు వంటచేస్తే కుక్కలుగా పుడతారు' చెత్త వ్యాఖ్యలపై మండిపడ్డ హీరోయిన్!

సారాంశం

గోపాల్ కృష్ణ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉండడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుగా లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

నెలసరి సమయంలో భర్తలకు వంట చేసే భార్యలు మరుజన్మలో ఆడకుక్కలుగా పుడతారంటూ స్వామీ కృష్ణస్వరూప్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి దారితీశాయి.

ఆయన వ్యాఖ్యలపై స్పందించిన ఓ మహిళ ''ఇదిగో ఈ ఇద్దరు మహిళలు ఇప్పుడు ఆడకుక్కలు అయ్యారు. వాళ్లు చేసిన పాపమెల్లా ఏమంటే... గత జన్మలో నెలసరిలో ఉండగా తమ భర్తలకు వంటచేయడమే'' అంటూ రెండు కుక్కలున్న ఫోటోని షేర్ చేశారు.

ఇది చూసిన  బీజేపీ అధికార ప్రతినిధి గోపాల్ కృష్ణ అగర్వాల్.. ''ఈ రెండింటిలో మీరు ఎవరు?'' అంటూ ప్రశ్నించారు. గోపాల్ కృష్ణ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉండడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుగా లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.

నటి స్వరాభాస్కర్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. ''బీజేపీ జాతీయ ప్రతినిధి ఓ బహిరంగ వేదికపై  మహిళలను దూషిస్తున్నారు. ఇది మీరు సిగ్గుపడాల్సిన విషయం అగర్వాల్ జీ.. మీ తల్లిదండ్రులు మీకు దేవుడి పేరు పెట్టారు. కనీసం ఆ పేరుకైనా విలువ ఇవ్వండి..'' అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?