సీఎం జగన్ తో టాలీవుడ్ నిర్మాతల భేటీ.. హుద్ హుద్ టైంలో రూ.15 కోట్లతో..

By tirumala ANFirst Published Feb 26, 2020, 6:28 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని టాలీవుడ్ నిర్మాతలు కొందరు కలిశారు. ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు వైసిపి పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరికొందరు పరోక్షంగా వైసీపీకి మద్దతు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని టాలీవుడ్ నిర్మాతలు కొందరు కలిశారు. ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు వైసిపి పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరికొందరు పరోక్షంగా వైసీపీకి మద్దతు తెలిపారు. ఇక  జగన్ సీఎం కావడం టాలీవుడ్ ప్రముఖులకు ఇష్టం లేదంటూ ఆ మధ్యన కమెడియన్ పృథ్వి చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. 

ఆ తర్వాత కొందరు సినీ ప్రముఖులు జగన్ ని కలిశారు. కొన్ని నెలల క్రితం మెగాస్టార్ చిరంజీవి కూడా జగన్ ని కలసిన సంగతి తెలిసిందే. ఇందంతా పక్కన పెడితే తాజాగా బుధవారం రోజు టాలీవుడ్ నిర్మాతలు కొందరు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో జగన్ ని కలిశారు. జగన్ ని కలసిన వారిలో దగ్గుబాటి సురేష్ బాబు, నల్లమలపు బుజ్జి, కిరణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి నిర్మాతలు ఉన్నారు. 

జగన్ తో భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జగన్ ని కలవడానికి గల కారణాలు వివరించారు. 2014లో భీకరమైన హుద్ హుద్ తుఫాన్ విశాఖ నగరాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో హుద్ హుద్ బాధితుల కోసం సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు సేకరించారు. టాలీవుడ్ ప్రముఖులు ఇచ్చిన విరాళాలతో దాదాపు 15 కోట్లతో బాధితులకు ఇళ్ళు నిర్మించి ఇచ్చారు. 

Indian2:'ఆ క్రేన్ నా మీద పడున్నా బావుండేది'.. శంకర్ షాకింగ్ కామెంట్స్!

ఆ ఇళ్ళని ప్రారంభించాలని జగన్ ని కోరినట్లు నిర్మాతలు తెలిపారు. జగన్ త్వరలోనే ఇళ్ళని పరిశీలించి ప్రారంభిస్తానని హామీ ఇచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో కూడా వైజాగ్ లాంటి నగరాల్లో స్టూడియోలు నిర్మించేందుకు పలువురు ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో టాలీవుడ్ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి కూడా సానుకూలమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

click me!