''ప్రకాష్ రాజ్ ని బ్యాన్ చేయాలి.. కాదని అవకాశాలిస్తే..''

By AN TeluguFirst Published Oct 31, 2019, 12:02 PM IST
Highlights

కొన్ని రోజుల క్రితం ఓ ఛానెల్ లో జరిగిన చర్చా వేదికలో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. చర్చలో భాగంగా ఆయన ఉత్తరప్రదేశ్ రథోత్సవానికి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ముంబై నుండి హెలికాప్టర్ల ద్వారా మోడల్స్ ని పిలిపిస్తున్నారని అన్నారు.

ప్రముఖ సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ని సినిమాల నుండి బహిష్కరించాలని కర్నాటక చలనచిత్ర వాణిజ్య మండలిలో ఫిర్యాదు నమోదైంది. హిందూ దేవుళ్లు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆయన వ్యాఖ్యలు చేశారని.. ఆయనకి సినిమాలలో అవకాశాలు ఇవ్వడానికి వీళ్లేదంటూ అఖిల భారత హిందూ మహాసభా వేదిక ఫిర్యాదు చేసింది.

దీనికి కారణం ఏంటంటే.. కొన్ని రోజుల క్రితం ఓ ఛానెల్ లో జరిగిన చర్చా వేదికలో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. చర్చలో భాగంగా ఆయన ఉత్తరప్రదేశ్ రథోత్సవానికి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ముంబై నుండి హెలికాప్టర్ల ద్వారా మోడల్స్ ని పిలిపిస్తున్నారని అన్నారు. వారికి మేకప్ చేయించి శ్రీరాముడు, సీత, లక్ష్మణుడి వేషాలు వేయిస్తున్నారని.. వారికి ఘనంగా పూలతో స్వాగతం పలుకుతున్నారని అన్నారు.

Bigg Boss 3: హౌస్ లో ఎలిమినేటెడ్ కంటెస్టంట్స్ హంగామా!

అటువంటి వారికి ఐఏఎస్ అధికారులు నమస్కరిస్తున్నారని.. ఈ విధమైన చర్యలు దేశానికి ప్రమాదకరమని అన్నారు. ఈ సందర్భంలో భారతదేశం ప్రజాస్వామ్య దేశమని.. ఎవరైనా వారికి ఇష్టం వచ్చినట్లు చేయొచ్చని.. అందరి మనోభావాలకు విలువ ఇవాలంటూ చర్చ వ్యాఖ్యత తెలిపారు.

దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్.. చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూస్తుంటే మౌనంగా ఎలా ఉంటామని, అదే విధంగా దేశానికి ప్రమాదకర విషయాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక్కడ ప్రకాష్ రాజ్ రామాయణాన్ని అశ్లీల వీడియోలని అర్ధం వచ్చేలా మాట్లాడడం పలువురి మనోభావాలు దెబ్బకొట్టేలా చేసింది.

దీంతో అతడిపై ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ప్రకాష్ రాజ్ వమానిస్తున్నారని, హిందువుల మనోభావాలుదెబ్బతినేలా మాట్లాడుతున్నారని ఫిల్మ్‌ చాంబర్‌కు కంప్లైంట్ అందింది. ఈ నేపథ్యంలో ఆయనను కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని, ఆయనకు కన్నడ సినిమాల్లో అవకాశం కల్పించకూడదని.. కాదని అవకాశాలు ఇస్తే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

click me!