మామ అల్లుళ్ళ కెమిస్ట్రీ పై మహేష్ కామెంట్

prashanth musti   | Asianet News
Published : Dec 17, 2019, 11:54 AM IST
మామ అల్లుళ్ళ కెమిస్ట్రీ పై మహేష్ కామెంట్

సారాంశం

వెంకటేష్ - నాగ చైతన్య కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ వెంకిమామ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్దసాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నారు.

రియల్ మామ అల్లుళ్ళు వెంకటేష్ - నాగ చైతన్య కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ వెంకిమామ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్దసాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నారు. సినిమాకు మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ స్టాండర్డ్ గానే ఉన్నాయి.

ఇక సినిమాను చూసిన సెలబ్రెటీలు హ్యాపీగా సినిమాపై స్పందిస్తున్నారు. ఎప్పటిలానే మహేష్ కూడా సినిమా చూసి పాజిటివ్ కామెంట్ చేశారు. సాదారణంగా ఒక సినిమా నచ్చితే వెంటనే రెస్పాండ్ అవ్వడం మహేష్ కి అలవాటు. ఇక ఇప్పుడు వెంకీమామ కి కూడా మహేష్ ఫిదా అయ్యాడు. సినిమాను చూసి చాలా ఎంజాయ్ చేసినట్లు చెప్పిన సూపర్ స్టార్ సినిమాలో వెంకటేష్ - నాగ చైతన్య ల మామ అల్లుళ్ళ కెమిస్ట్రీ స్క్రీన్ పై వెలిగిపోయిందని అన్నారు.

అలాగే సినిమాలో కామెడీ ఎమోషన్స్ ఫ్యామిలీ సీన్స్ కూడా బావున్నాయని మహేష్ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని పేర్కొన్నారు. ఇక సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే 20కోట్లకు పైగా షేర్స్ అందించింది. ఇదే తరహాలో కలెక్షన్స్ వస్తే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించారు. థమన్ సంగీత అందించిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించారు.

మొదటి రోజే కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసిన సినిమాలు

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?