జానీ టాలీవుడ్ లో 'మను' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో అతడి నటనకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
టాలీవుడ్ నటుడు జాన్ కొట్టోలీ కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు సాయి రాజేష్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
జానీ టాలీవుడ్ లో 'మను' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో అతడి నటనకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కెరీర్ ఆరంభంలో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించారు.
'మిస్టర్ అమాయకుడు', 'కళాకారుడు' ఇలా కొన్ని పాపులర్ షార్ట్ ఫిలిమ్స్ లో ఆయన నటించారు. ఆయన మరణించిన విషయం తెలిసిన కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
Unable to digest the news about ... Heard that he was passed away with cardiac arrest..
Brilliant actor he is...