సానియా మీర్జా బయోపిక్.. సీనియర్ హీరోయిన్ తో చర్చలు!

prashanth musti   | Asianet News
Published : Jan 28, 2020, 04:42 PM IST
సానియా మీర్జా బయోపిక్.. సీనియర్ హీరోయిన్ తో చర్చలు!

సారాంశం

టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జీవితం కూడా తెరపైకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది క్రీడాకారుల జీవితాలపై సినిమాలొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మిథాలీ రాజ్ - పుల్లెల గోపీచంద్ -సైనా నెహ్వాల్ వంటి ప్లేయర్స్ వంటి వారి బయోపిక్స్ సెట్స్ పైకి వచ్చాయి. 

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జీవితం కూడా తెరపైకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది క్రీడాకారుల జీవితాలపై సినిమాలొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మిథాలీ రాజ్ - పుల్లెల గోపీచంద్ -సైనా నెహ్వాల్ వంటి ప్లేయర్స్ వంటి వారి బయోపిక్స్ సెట్స్ పైకి వచ్చాయి. త్వరలోనే సానియా మీర్జా జీవితం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు క్లారిటీ వచ్చింది.

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సానియా మీర్జా తన బయోపిక్ పై స్పందించింది. రీసెంట్ గా కొంతమంది రచయితలతో మాట్లాడినట్లు చెప్పిన సానియా క్రీడాకారుల కృషి, పట్టుదల, కష్టాల గురించి అందరికి తెలియాల్సిన అవసరం ఉందని వివరించింది. అయితే  సినిమాకు సంబందించిన పూర్తి వివరాలపై సానియా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం డిస్కర్షన్స్ లో ఉన్న అ ప్రాజెక్టు త్వరలోనే సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.

ఇకపోతే సానియా మీర్జా బయోపిక్ లో కరీనా కపూర్ కనిపించబోయో అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లి తరువాత కూడా తనదైన శైలిలో పాత్రలు చేసుకుంటూ వెళుతున్న ఆమె ప్రస్తుతం ఒక ప్రముఖ సెలబ్రెటీ బయోపిక్ లో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ బయోపిక్ సానియా మిర్జాదే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరీ ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?