టాలీవుడ్ ప్రముఖ పీఆర్వో, ప్రొడ్యూసర్ బీఏ రాజు మృతి

Published : May 22, 2021, 12:50 AM ISTUpdated : May 22, 2021, 12:55 AM IST
టాలీవుడ్ ప్రముఖ పీఆర్వో, ప్రొడ్యూసర్ బీఏ రాజు మృతి

సారాంశం

తెలుగు ఇండస్ట్రీ ప్రముఖ ప్రొడ్యూసర్, సినిమా పీఆర్వో బీఏ రాజు అకాల మరణం చెందారు.

తెలుగు ఇండస్ట్రీ ప్రముఖ ప్రొడ్యూసర్, సినిమా పీఆర్వో బీఏ రాజు అకాల మరణం చెందారు. నిన్న రాత్రి ఆయన షుగర్ లెవెల్స్ లో ఫ్లక్చువేషన్స్ రావడం వల్ల  గుండెపోటుకు గురై మరణించారు. ఆయన అకాల మరణ వార్త విని సినీ లోకం షాక్ కి గురైంది. 

సినిమా జర్నలిస్ట్ గా కెరీర్ ని ప్రారంభించిన బీఏ రాజు గారు అప్పట్లో సూపర్ హిట్ మ్యాగజైన్ కి సంపాదకులుగా పనిచేసారు. అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమ గురించిన పూర్తి సమాచారం కోసం అంతా ఆ మ్యాగజైన్ నే ఆశ్రయించేవారు. ఇక ఆ తరువాత కంప్యూటర్ కాలం వచ్చేసరికి ఇండస్ట్రీ హిట్ డాట్ కాం అనే వెబ్ సైట్ ని నెలకొల్పి సినిమా అప్డేట్స్ ని అందించసాగారు. 

సినిమా ఇండస్ట్రీలో పీఆర్వో అనగానే ఎవ్వరికైనా ఠక్కుమని గుర్తొచ్చే పేరు బీఏ రాజు. దాదాపుగా 1000కి పైచిలుకు సినిమాలకు ఆయన పీఆర్వో గా వ్యవహరించారు. ఇండస్ట్రీలోని అన్ని క్రాఫ్ట్స్ కి చెందిన వారితో సన్నిహిత సంబంధాలు నెరిపేవారు బీఏ రాజు. ఇండస్ట్రీలోని హీరోలు, డైరెక్టర్లతో సన్నిహిత సంబంధాలను నెరిపేవారు రాజు. 

ఆయన భార్య జయ సైతం ఈ మధ్యనే మరణించారు. ఆయన సౌమ్యశీల స్వభావం ఇండస్ట్రీలో ఆయనకు ఎంతో మంది మిత్రులను ఇచ్చింది. పబ్లిక్ రిలేషన్స్ పరంగా ఆయన సినిమా రంగానికి చేసిన సేవలు అనిర్వచనీయం. ఆయన మృతితో ఇండస్ట్రీ అంతా దిగ్భ్రాంతికి లోనైంది. ఇండస్ట్రీ వర్గాలన్నీ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?