ప్రియదర్శి ‘మెయిల్’ మూవీకి అరుదైన ఘనత... న్యూయార్క్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపిక...

By Chinthakindhi RamuFirst Published May 8, 2021, 5:02 PM IST
Highlights

జూన్ 4 నుంచి ప్రారంభం కానున్న న్యూయార్క్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్...

తెలుగు నుంచి ఎంపికైన ప్రియదర్శి ‘మెయిల్’ మూవీ... జనవరి 12న ‘ఆహా’ ఓటీటీలో నేరుగా విడుదలైన ‘కంబలపల్లి కథలు’ సిరీస్‌లో ‘ఛాప్టర్ 1’...

ఓటీటీ ఫ్లాట్‌ఫాంల ఎంట్రీ కారణంగా చిన్న బడ్జెట్ సినిమాలకు కూడా మంచి గుర్తింపు దక్కుతోంది. గత ఏడాది ఓటీటీలో విడుదలైన ‘కలర్ ఫోటో’ సూపర్ సక్సెస్ సాధించగా... తాజాగా మరో చిన్న సినిమా ‘మెయిల్’కి అరుదైన గౌరవం దక్కింది.

ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘కంబలపల్లి కథలు’ సిరీస్‌లోని ‘మెయిల్’ మూవీ, 2005 ప్రారంభంలో గ్రామీణ ప్రాంతాల్లో మనుషుల అమాయకత్వాన్ని, గ్రామాల్లోకి కంప్యూటర్ వచ్చిన తొలిరోజుల్లో తీసుకొచ్చిన మార్పులకు అద్దం పట్టింది.

తాజాగా ‘మెయిల్’ మూవీ... జూన్ 4 నుంచి ప్రారంభమయ్యే న్యూయార్క్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకి ఎంపికయ్యింది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాణ సంస్థ ‘స్వప్న సినిమా’ సోషల్ మీడయా ద్వారా తెలియచేసింది. ప్రియాంక దత్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహారించగా ఉదయ్ గుర్రాల దర్శకత్వం వహించాడు.

click me!