ముద్దు ముద్దుగా రిక్వస్ట్ చేసిన అల్లు అర్జున్ కొడుకు.. ఓకే చెప్పిన టైగర్ ష్రాఫ్

Published : Mar 16, 2020, 04:58 PM IST
ముద్దు ముద్దుగా రిక్వస్ట్ చేసిన అల్లు అర్జున్ కొడుకు.. ఓకే చెప్పిన టైగర్ ష్రాఫ్

సారాంశం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతున్నారు. వీరిద్దరికి సంబంధించిన చిన్న వీడియో బయటకు వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతున్నారు. వీరిద్దరికి సంబంధించిన చిన్న వీడియో బయటకు వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం అల్లు అయాన్ ఆదివారం నుంచి ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారాడు. 

అయాన్ చదువుకుంటున్న స్కూల్ లో ప్రీ స్కూల్ గ్రాండ్యుయేషన్ సెలెబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా బన్నీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ అయాన్ కి సంబంధించిన ఓ వీడియోను ఇంస్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఈ వీడియోలో అల్లు అయాన్ బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ ని ముద్దు ముద్దుగా రిక్వస్ట్ చేస్తున్నాడు. 

'హాయ్ టైగర్ స్క్వాష్.. భాగీ 3 సెట్స్ కు నన్ను పిలవండి ప్లీజ్ అని అడిగాడు. పక్కనే ఉన్న ఆలు అర్జున్ ఎందుకు అని అడిగాడు.  ఎందుకంటే టైగర్ బాడీ, గన్ ఫైట్స్ చాలా బావుంటాయి అని అల్లు అయాన్ సమాధానం ఇచ్చాడు. ఈ వీడియో చూసిన టైగర్ ష్రాఫ్ సోషల్ మీడియాలో స్పందించాడు. 

పవన్ తో తొలిప్రేమ డైరెక్టర్, క్రేజీ ప్లాన్.. నిజామా.. పులిహోరానా?

అల్లు అయాన్ తనని టైగర్ స్క్వాష్ అని పిలవడంపై స్పందిస్తూ.. నా కొత్త పేరు చాలా బావుంది. భాగీ 3 సెట్స్ కి మాత్రమే కాదు.. తను నా అన్ని చిత్రాల సెట్స్ కు రావచ్చిన చెప్పండి అల్లు అర్జున్ సర్ అని టైగర్ ష్రాఫ్ కామెంట్ పెట్టాడు. అల్లు అయాన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?