అందుకే అతడంటే ఇష్టం.. ఏ హీరోకి సాధ్యం కాదు.. దిశా పటాని!

Published : Dec 06, 2019, 10:06 PM IST
అందుకే అతడంటే ఇష్టం.. ఏ హీరోకి సాధ్యం కాదు.. దిశా పటాని!

సారాంశం

పూరి జగన్నాధ్ దర్శత్వంలో తెరకెక్కిన లోఫర్ చిత్రంతో దిశా పటాని హీరోయిన్ గా పరిచయమైంది. మోడల్ గా రాణిస్తున్న సమయంలో పూరి జగన్నాధ్ దిశా పటానికి హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు.

పూరి జగన్నాధ్ దర్శత్వంలో తెరకెక్కిన లోఫర్ చిత్రంతో దిశా పటాని హీరోయిన్ గా పరిచయమైంది. మోడల్ గా రాణిస్తున్న సమయంలో పూరి జగన్నాధ్ దిశా పటానికి హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. లోఫర్ మూవీలో దిశా గ్లామర్ కు యువత ఫిదా అయ్యారు. 

కానీ లోఫర్ మూవీ నిరాశపరచడంతో దిశా పటాని టాలీవుడ్ కు టాటా చెప్పేసింది. బాలీవుడ్ కు వెళ్లి అక్కడ కొన్ని చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. కానీ దిశా పటాని క్రేజీ హీరోయిన్ గా మారిపోయేంతలా అయితే బాలీవుడ్ లో కూడా సక్సెస్ రాలేదు. కానీ దిశా సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్. 

బోల్డ్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రకారు హృదయాలు కొల్లగొడుతోంది. తాను చేసే బోల్డ్ ఫోటో షూట్స్ పై కూడా దిశా అంతే ఘాటుగా స్పందించింది. గ్లామర్ ఫీల్డ్ లో సిగ్గు, బిడియం ఉండకూడదని తెలిపింది. బాఘీ2 చిత్రంలో టైగర్ ష్రాఫ్ తో దిశా పటాని రొమాన్స్ పండించింది. చాలా కాలం పాటు దిశా పటాని, టైగర్ ష్రాఫ్ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. వీరిమధ్య ఘాటు ఎఫైర్ సాగుతోందంటూ బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. 

తాజాగా దిశా పటాని ఓ ఇంటర్వ్యూలో టైగర్ ష్రాఫ్ గురించి ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. తన ఫేవరేట్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ అని తెలిపింది. టైగర్ ష్రాఫ్ లాగా యాక్షన్ సన్నివేశాల్లో పెర్ఫామ్ చేయడం మరో హీరోకి సాధ్యం కాదు అని దిశా తెలిపింది. అందుకే తనకు టైగర్ ష్రాఫ్ అంటే ఇష్టం అని దిశా పటాని కామెంట్స్ చేసింది. 

టైగర్ ష్రాఫ్ తండ్రి జాకీ ష్రాఫ్ కూడా గతంలో వీరిద్దరి ఎఫైర్ గురించి కామెంట్ చేశారు. మీరు ఎవరి గురించి అడుగుతున్నారో వారిద్దరూ భవిష్యత్తులో వివాహం చేసుకునే అవకాశం ఉంది లేదా జీవితాంతం బెస్ట్ ఫ్రెండ్స్ గా కూడా ఉండిపోవచ్చు అని జాకీ ష్రాఫ్ ఓ సందర్భంలో అన్నారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?