అలాంటి భర్త ఆమెకు అవసరమా.. చెన్నకేశవులు భార్యపై జీవిత కామెంట్స్!

By tirumala ANFirst Published Dec 6, 2019, 8:08 PM IST
Highlights

దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇండియా మొత్తం తెలంగాణ పోలీసులు చర్యని సమర్థిస్తున్నారు. నిందితుల ఎన్ కౌంటర్ తో దిశ కేసులో సరైన న్యాయం జరిగిందని అంటున్నారు.

దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇండియా మొత్తం తెలంగాణ పోలీసులు చర్యని సమర్థిస్తున్నారు. నిందితుల ఎన్ కౌంటర్ తో దిశ కేసులో సరైన న్యాయం జరిగిందని అంటున్నారు. మహమ్మద్ ఆరిఫ్, శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు అనే నలుగురు నిందితులు నవంబర్ 27న శంషాబాద్ ప్రాంతంలో దిశని అత్యాచారం చేసి, అత్యంత కిరాతకంగా సజీవదహనం చేశారు. 

ఈ దారుణ సంఘటనని యావత్ దేశం ముక్తకంఠంతో ఖండించింది. నిందితులని ఉరితీయాలని, ఎన్ కౌంటర్ చేయాలని ప్రజలంతా డిమాండ్ చేశారు. పోలీసులు వేగంగా నిందితులని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ జరుగుతోందని అంతా భావిస్తున్న సమయంలో.. ఊహించని విధంగా పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున నలుగురు నిందితులని ఎన్ కౌంటర్ చేసి హతమార్చారు. 

దీనితో దిశకు సరైన న్యాయం జరిగిందంటూ పోలీసులపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఎన్ కౌంటర్ సంఘటనపై హీరో రాజశేఖర్ సతీమణి, నటి జీవిత స్పందించారు. తెలంగాణ పోలీసులని ఆమె అభినందించారు. విచారణని పోలీసులు వేగంగా చేపట్టారు. ఎన్ కౌంటర్ సంఘటనపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. 

ఎన్ కౌంటర్ పరిష్కారం కాదు.. రాంగోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ప్రత్యేక పోలీస్ వ్యవస్థని తీసుకురావాలని కోరారు. నిందితులలో ఏ4 గా ఉన్న చెన్నకేశవులు భార్య రేణుక కామెంట్స్ పై జీవిత స్పందించారు. కోర్టు శిక్ష విధించకముందే పోలీసులు ఎలా ఎన్ కౌంటర్ చేస్తారు అని చెన్నకేశవులు భార్య రేణుక ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీనిపై జీవిత మాట్లాడుతూ.. ఒక భార్యగా ఆమెకు ఆవేదన ఉండొచ్చు. కానీ మేమే అత్యాచారం చేశాం, మేమే హత్య చేశాం అని పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి.

తన భర్త చనిపోయిన బాధలో ఆమె మాట్లాడుతోంది. కానీ అలాంటి భర్త ఆమెకు అవసరమా అని జీవిత ప్రశ్నించారు. తన భర్త ఘోరం చేశాడని, ఎలాంటి శిక్ష విధించినా పర్వాలేదు అని చెన్నకేశవులు భర్త కొన్ని రోజుల క్రితం మాట్లాడింది. ప్రస్తుతం ఆమె భర్త చనిపోయాడనే బాధలో మాట్లాడుతోంది అని జీవిత అన్నారు. 

click me!