హీరో రాజశేఖర్ కు ప్లాస్మా థెరపీ: హెల్త్ బులిటెన్ విడుదల

Published : Oct 27, 2020, 03:22 PM ISTUpdated : Oct 27, 2020, 03:23 PM IST
హీరో రాజశేఖర్ కు ప్లాస్మా థెరపీ: హెల్త్ బులిటెన్ విడుదల

సారాంశం

తెలుగు సినీ హీరో రాజశేఖర్ కు ప్లాస్మా థెరపి చేయనున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు వైద్యులు రాజసేఖర్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాధికి చికిత్స పొందుతన్న తెలుగు సినీ హీరో రాజశేఖర్ ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. రాజశేఖర్ కు ప్లాస్మా థెరపీ చేయనున్నట్లు ఆయన చెప్పారు ఆయన ఆరోగ్యం మెరుగైందని అన్నారు. చికిత్సకు రాజశేఖర్ స్పందిస్తున్నట్లు తెలిపారు 

కరోనా వైరస్ సోకడంతో సతీమణి జీవితతో పాటు ఆయన కూడా ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. జీవితా రాజశేఖర్ కు పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్లు ఇటీవల తేలింది. దీంతో ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు.

ఆ మధ్య రాజశేఖర్ కూతురు శివాత్మిక ట్విట్టర్ వేదికగా ఆయన ఆరోగ్యం గురించి తీవ్రమైన వ్యాఖ్య చేశారు. దాంతో అబిమానుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. అయితే, ఆ తర్వాత జీవీతా రాజశేఖర్ జోక్యం చేసుకుని ఆందోళన అక్కర్లేదని, రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు.

రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆశించారు. ఈ మేరకు వారు తమ సందేశాలను ఇచ్చారు. కరోనా వైరస్ తో రాజశేఖర్ కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేరారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?