'విజిల్' నా కథ.. కోర్టుకి వెళ్తా.. డైరెక్టర్ కామెంట్స్!

By AN TeluguFirst Published Oct 30, 2019, 1:04 PM IST
Highlights

'సత్యమేవ జయతే' కార్యక్రమంలో నాగ్ పూర్ కి చెందిన అఖిలేపాల్ అనే వ్యక్తి జీవిత కథను విన్నట్లు తెలిపారు. ఆయన ఓ మురికివాడలో పుట్టి ఎన్నో నేరాలు చేసి ఆ తరువాత ఫుట్ బాల్ ప్లేయర్ గా ఎదిగి బ్రెజిల్ లో జరిగిన సాకర్ కప్ టోర్నమెంట్ లో భారత జట్టుకి ప్రాతినిధ్యం వహించాడని చెప్పారు.

తాను కాపీ రైట్స్ తీసుకున్న కథను మరొకరికి అమ్మిన వ్యక్తిపై, ఆ కథతో సినిమా తీసిన నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలని రచయిత డాక్టర్ నంది చిన్నికుమార్ కోరుతున్నారు. మంగళవారం నాడు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. అమీర్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించే 'సత్యమేవ జయతే' కార్యక్రమంలో నాగ్ పూర్ కి చెందిన అఖిలేపాల్ అనే వ్యక్తి జీవిత కథను విన్నట్లు తెలిపారు.

ఆయన ఓ మురికివాడలో పుట్టి ఎన్నో నేరాలు చేసి ఆ తరువాత ఫుట్ బాల్ ప్లేయర్ గా ఎదిగి బ్రెజిల్ లో జరిగిన సాకర్ కప్ టోర్నమెంట్ లో భారత జట్టుకి ప్రాతినిధ్యం వహించాడని చెప్పారు. ప్రస్తుతం మురికివాడల్లో, రెడ్ లైట్ ఏరియాల్లోపిల్లలకు కోచ్ గా వ్యవహరిస్తున్నానని చెప్పారు.

నిర్మాతలను పట్టించుకోని తెలుగు బ్యూటీ..!

అతని జీవిత కథ తనకు నచ్చడంతో ఆయన దగ్గరకు వెళ్లి సినిమా తీయడానికి 2018 మార్చి 19న కాపీరైట్స్ అగ్రిమెంట్ చేసుకున్నానని వివరించారు. దీనికి కొంత మొత్తాన్ని కూడా చెల్లించినట్లు చెప్పారు. తాను సినిమా స్టోరీ అంతా సిద్ధం చేసుకొని నటీనటులు, నిర్మాతల కోసం వెతుకున్నట్లు చెప్పారు. 

అయితే ఇటీవల విడుదలైన 'విజిల్' సినిమా తాను కాపీ రైట్స్ తీసుకున్న కథేనని చెప్పారు. ఈ విషయంపై అఖిలే పాల్ ని సంప్రదిస్తే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని.. అలానే సినిమా బృందాన్ని సంప్రదించినా ఎలాంటి రెస్పాన్స్ లేదని చెప్పారు.

దీంతో తెలంగాణా రైటర్స్ అసోసియేషన్, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు చెప్పారు. త్వరలోనే కోర్టుని కూడా సంప్రదిస్తానని చెప్పారు. 

 

click me!