వైభవంగా సినీ నటి అర్చన పెళ్లి వేడుక

By Prashanth MFirst Published Nov 15, 2019, 1:51 PM IST
Highlights

అర్చన వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబందించిన వీడియోలు ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి పెళ్లి హడావుడి ఈవెంట్స్ నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఆమె ఫైనల్ గా గురువారం రాత్రి మూడుముళ్ల బంధంతో తన ప్రియుడికి మరింత దగ్గరైంది. 

టాలీవుడ్ సీనియర్ నటి అర్చన వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబందించిన వీడియోలు ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి పెళ్లి హడావుడి ఈవెంట్స్ నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఆమె ఫైనల్ గా గురువారం రాత్రి మూడుముళ్ల బంధంతో తన ప్రియుడికి మరింత దగ్గరైంది.

నేను సినిమాతో టాలీవుడ్ కి బాగా దగ్గరైన అందమైన తెలుగు నటి అర్చన బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ తో మరింత క్రేజ్ అందుకుంది. హైదరాబాద్ హెల్త్ కేర్ వైజ్ ప్రేజిడెంట్ జగదీష్ తో అర్చన గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. ఇక ఫైనల్ గా ఇరు కుటుంబాల సమక్షంలో గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు ఈ యువ జంట పెళ్లి చేసుకుంది.

రీసెంట్ వీరి సంగీత్ వేడుక కూడా అట్టహాసంగా జరిగింది. బిగ్ బాస్ మొదటి సీజన్ లో అర్చన కంటెస్టెంట్ గా వెళ్లిన విషయం తెలిసిందే. పెళ్లిలో బిగ్ బాస్ 1 విన్నర్ శివబాలాజీ కూడా పాల్హోన్నాడు. వధువరుడు ఇద్దరు కూడా సంగీత్ వేడుకలో స్టెప్పులేస్తూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.  గత వారం ప్రియుడితో అర్చన నిశ్చితార్థం వైభవంగా జరిగింది.

సోషల్ మీడియాలో కూడా అర్చన తన ప్రియుడి ఫొటోల్ని షేర్ చేసింది. కొన్ని రోజుల క్రితమే అర్చన ప్రియుడితో కలసి ఉన్న ఫోటో షేర్ చేసి త్వరలోనే మీ అందరికి గుడ్ న్యూస్ చెబుతా అంటూ అభిమానులకు తెలియజేసింది. దీనితో అర్చన త్వరలో పెళ్లి పీటలెక్కబోతోందని అభిమానులు ఊహించారు.

read also: నష్టాలతో దెబ్బకొట్టిన మన స్టార్ హీరోల సినిమాలు.. లాస్ ఎంత?

ఫైనల్ గా హైదరాబాద్ లో వైభవంగా మూడుముళ్ల బంధంతో ఈ జంట మరింత దగ్గరైంది. వేడుకకు పలువురు సినీ సెలబ్రెటీలు అలాగే రాజాకీయ నాయకులు వ్యాపారవేత్తలు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. బిగ్ బాస్ మొదటి సీజన్ లో మెరిసిన అర్చన ఆ తరువాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. మరి పెళ్లి అనంతరం అర్చన సెకండ్ ఇన్నింగ్స్ ఎలా స్టార్ట్ చేస్తుందో చూడాలి.

click me!