నేను బాగానే ఉన్నాను.. సీనియర్ నటుడు కృష్ణంరాజు కామెంట్స్!

Published : Nov 21, 2019, 11:05 AM IST
నేను బాగానే ఉన్నాను.. సీనియర్ నటుడు కృష్ణంరాజు కామెంట్స్!

సారాంశం

తాను కొద్దిరోజులుగా వైరల్‌ ఫీవర్‌తో బాధపడ్డానని, ఇప్పుడు పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు తెలిపారు.  

సీనియర్ నటుడు కృష్ణంరాజు అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని ఖండించిన కృష్ణంరాజు తాను చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్తే విషయం తెలుసుకోకుండా మీడియా తప్పుడు వార్తలు రాస్తుందంటూ ఫైర్ అయ్యారు.

తాను కొద్దిరోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడ్డానని.. ఇప్పుడు పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని రెబల్ స్టార్ కృష్ణంరాజు తెలిపారు. బుధవారం నాడు తమ పెళ్లిరోజు సందర్భంగా కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి బంజారాహిల్స్ లోని శ్రీవిజయ గణపతి దేవాలయంలో శతచండీ మహాయాగంలో పాల్గొన్నారు. 

‘జార్జిరెడ్డి’ ఫిల్మ్ నగర్ టాక్ ఏంటి..?

మహాలక్ష్మీ దేవికి విశేష పూజలు నిర్వహించారు. ఆ తరువాత తన ఇంట్లో మీడియాతో మాట్లాడిన కృష్ణంరాజు తన ఆరోగ్యం ఎలా ఉందనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. జలుబు, దగ్గు, జ్వరం సాధారణంగా అందరికీ వస్తుంటాయని.. అందులో భాగంగా తనకు కూడా ఫీవర్ వచ్చిందని, దీనిపై మీడియా తప్పుడు వార్తలు రాసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వార్తలు రాసే ముందు ఓసారి తనను సంప్రదించి ఉంటే బాగుండేదని అన్నారు. గత నాలుగు రోజుల నుండి చాలా మంది అభిమానులు ఫోన్ చేసి తన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారని చెప్పారు. తాను బావున్నట్లు అందరికీ చెప్పానని వెల్లడించారు. తనను ఆశీర్వదించిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?