'సిత్తరాల సిరపడు' పాటకి టీడీపీ ఎంపీ ఎమోషనల్.. అల్లు అర్జున్ కి థాంక్స్!

By tirumala ANFirst Published Jan 19, 2020, 10:25 AM IST
Highlights

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం 'అల.. వైకుంఠపురములో'. అల్లు అర్జున్ తన నటనతో, త్రివిక్రమ్ రచనతో మరోసారి ప్రేక్షకులని మెప్పించారు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతోంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం 'అల.. వైకుంఠపురములో'. అల్లు అర్జున్ తన నటనతో, త్రివిక్రమ్ రచనతో మరోసారి ప్రేక్షకులని మెప్పించారు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతోంది. పూజా హెగ్డే గ్లామర్, టబు రీఎంట్రీ, నివేత పేతురాజ్, సుశాంత్ పాత్రలు ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

ముఖ్యంగా తమన్ అందించిన సంగీతం ఓ అద్భుతం అనే చెప్పాలి. ఈ చిత్రంలోని పాటలు యూట్యూబ్ లో వందల మిలియన్ల వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతున్నాయి. అంతటితో తమన్ సరిపెట్టుకోలేదు. సినిమాని మరో స్థాయికి చేర్చేలా బ్యాగ్రౌండ్ సంగీతం కూడా అందించాడు. 

బన్నీ కెరీర్ బిగ్గెస్ట్ రికార్డ్.. మహేష్ అందుకోవడం కష్టమే!

ప్రతి ఒక్కరూ తమన్ పాటల గురించే మాట్లాడుకుంటున్నారు. సామజవరగమన సాంగ్ తో మొదలైన సునామి లేటెస్ట్ గా విడుదలైన సిత్తరాల సిరపడు సాంగ్ తో కొనసాగుతూనే ఉంది. శ్రీకాకుళం యాసలో రూపొందించిన ఈ పాటతో త్రివిక్రమ్ ప్రేక్షకులని సర్ ప్రైజ్ చేశారు. చిత్రంలో వచ్చే ఓ ఫైట్ సన్నివేశంలో ఈ పాట ఉంటుంది. 

త్రివిక్ర‌మ్ కొత్త సినిమా టైటిల్ అదేనా..?

పాటకు తగ్గట్లుగా అల్లు అర్జున్ చేసిన ఫైట్ ఆకట్టుకుంటోంది. శ్రీకాకుళం వాడుక భాషలోని పదాలతో గేయ రచయిత విజయ్ కుమార్ భల్లా అద్భుతమైన సాహిత్యం అందించారు. సూరన్న, సాకేత్ ఈ పాటని పాడారు. ఈ తన సొంత జిల్లా సాహిత్యానికి అల..వైకుంఠపురములో లాంటి క్రేజీ మూవీలో పెద్ద పీట వేయడంతో శ్రీకాకుళం టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. కాస్త ఎమోషనల్ అయ్యారు కూడా. ఈ సంధర్భంగా ఆ పాట గురించి రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. 

1/2
అల.. వైకుంఠపురములో శ్రీకాకుళం జానపద గీతాల చరిత్రను దృష్టిలో ఉంచుకుని మా వాడుక భాషలో రాసిన 'సిత్తరాల సిరపడు' విని చాలా ఆనందించాను. ఈ జిల్లా సంస్కృతి సాహిత్యం తెలుగువాళ్ళకి చెప్పిన దర్శకులు, రచయిత, గేయకర్తకు కృతఙ్ఞతలు.
Thanks for that stylish fight matching the song https://t.co/DLgRjVD1FR

— Ram Mohan Naidu K (@RamMNK)

శ్రీకాకుళం సాహిత్యాన్ని ఉపయోగిస్తూ అల వైకుంఠపురములో చిత్రంలో సిత్తరాల సిరపడు పాటని రూపొందించారు. ఆ పాట విని ఆనందించాను. ఈ జిల్లా సంస్కృతి, సాహిత్యం గురించి తెలుగు వారికి తెలియజెప్పిన దర్శకులు త్రివిక్రమ్, రచయిత విజయ్ కుమార్ లకు ధన్యవాదాలు. పాటకు తగ్గట్లుగా అల్లు అర్జున్ చేసిన పోరాటం బావుంది. అందుకు థాంక్స్ అని రామ్మోహన్ నాయుడు తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

2/2
Thank you Sooranna and for giving us the song in the lovely Srikakulam accent. Thanking Vijay Kumar Bhalla for those lyrics reminiscing our folk ballads and Trivikram Garu for highlighting Sikkolu culture in mainstream cinema. https://t.co/zSdMzZDpvX

— Ram Mohan Naidu K (@RamMNK)
click me!