రజనీకాంత్ కు విశ్రాంతి అవసరం, ఎవరూ రావద్దు: అపోలో వైద్యులు

Published : Dec 25, 2020, 04:37 PM ISTUpdated : Dec 25, 2020, 04:40 PM IST
రజనీకాంత్ కు విశ్రాంతి అవసరం, ఎవరూ రావద్దు: అపోలో వైద్యులు

సారాంశం

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు విశ్రాంతి అవసరమని హైదరాబాదులోని అపోలో వైద్యులు చెప్పారు. తీవ్రమైన ఆస్వస్థతతో రజినీకాంత్ శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని అపోలోలో చేరిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు విశ్రాంతి అవసరమని హైదరాబాదులోని జూబ్లీహిల్స్ అపోలో వైద్యులు చెప్పారు. రజినీకాంత్ కు బీపీ తప్ప మరో సమస్య లేదని స్పష్టం చేశారు. రజినీకాంత్ ను ఎవరూ డిస్ట్రబ్ చేయవద్దని వారు కోరారు. రజినీకాంత్ ను కలిసేందుకు ఎవరూ రావద్దని వారు సూచించారు.

ఆపోలో ఆస్పత్రి వద్ద భద్రతను పెంచారు. లోనికి రోగులను, సిబ్బందిని తప్ప ఎవరినీ అనుమతించడం లేదు. కొత్తవారిని కూడా ఆస్పత్రిలోకి రానీయడం లేదు. బీపీ సమస్యతో రజనీకాంత్ శుక్రవారం ఉదయం అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. రజినీకాంత్ తో పాటు ఆయన కూతురు ఐశ్వర్య ఆస్పత్రికి వచ్చారు. 

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఆయన హైదరాబాదులో హోం క్వారంటైన్ లో ఉన్నారు. రజినీకాంత్ జుబిలీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. హై బీపీ కారణంగా ఆయన అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నారు. అన్నాతే సినిమా షూటింగ్ కోసం రజినీకాంత్ ఇటీవల హైదరాబాదు వచ్చారు. రామోజీ ఫిల్స్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా బృందంలోని ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. 

దాంతో రజినీకాంత్ ఈ నెల 22వ తేదీన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ ఆయన హోం క్వారంటైన్ కు వెళ్లారు. అకస్మాత్తుగా శుక్రవారం ఆయన ఆరోగ్యం క్షీణించింది. దాంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. 

రజినీకాంత్ కు కరోనా పాజిటివ్ వచ్చిందనే పుకార్లు షికారు చేశాయి. అయితే, రజినీకాంత్ కు కోవిడ్ లక్షణాలు లేవని వైద్యులు స్ప,ష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?