దీన స్థితిలో ప్రముఖ తమిళ నిర్మాత.. ఆర్థిక సాయం చేసి.. అండగా నిలిచిన తమిళ స్టార్ సూర్య..

By Asianet News  |  First Published Mar 7, 2023, 5:26 PM IST

తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ  నిర్మాత ఆర్తికంగా బాగా ధీన స్థితికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న సూర్య వెంటనే సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ న్యూస్ కోలీవుడ్ వర్గాల హాట్ టాపిక్ గా మారింది. 
 


తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత వీఏ దురై (VA Durai) ప్రస్తుతం దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు.  కోలీవుడ్ లోని స్టార్ హీరోలతో ఎన్నో విజయవంతమైన సినిమాలను రూపొందించిన ఆయన ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడటంతో పాటు ఆర్థికంగాను చితికిపోయారు. తన సన్నిహితుల ద్వారా విషయం తెలుసుకున్న తమిళ స్టార్ సూర్య (Suriya) వెంటనే స్పందించారు. ఆర్థికంగా కావాల్సిన ఏర్పాట్లు చేసినట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

దురై ప్రస్తుతం మధుమేహంతో బాధపడుతున్నారని తెలుసుకొని తక్షణ సాయంగా రూ.2 లక్షలు అందజేశారంట సూర్య. మరింత సాయం కూడా అందిస్తానని హామీనిచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం దురై ఫ్రెండ్ సర్కిల్లోనే ఉండగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సూర్య మంచితనానికి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సూర్య ముందడుగు వేయడంతో దురైకి సాయం చేసేందుకు తమిళ ఇండస్ట్రీ నుంచి మరికొంత మంది ముందుకు వస్తున్నారు.  

Latest Videos

ప్రస్తుతం దీన స్థితిలో ఉన్న దురై గతంలో ఎవర్ గ్రీన్ ఇంటర్నేషనల్ అనే బ్యానర్ ను స్థాపించారు. అంతకుముందు ప్రముఖ నిర్మాత ఏఎం రత్ననాథ్ తో కలిసి ప్రొడక్షన్ మేనేజ్ మెంట్  లో పనిచేశారని తెలుస్తోంది. ఎవర్ గ్రీన్ స్థాపించిన తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్, విజయకాంత్, విక్రమ్, సూర్య, సత్యరాజ్ వంటి హీరోలతో మంచి చిత్రాలను నిర్మించారు. ప్రముఖ దర్శకుడు బాల తెరకకెక్కించిన ‘పితామగన్’తో నిర్మాతగా మంచి పేరు దక్కించుకున్నారు. ఈ చిత్రంలో సూర్య, విక్రమ్ కలిసి నటించగా.. జాతీయ అవార్డు కూడా దక్కింది. 

ఆ తర్వాత నిర్మించిన సినిమాలు పెద్దగా లేకపోవడం.. అప్పటికే కుదేలైనట్టు తెలుస్తోంది.  ఆయనకు సొంత ఇల్లు కూడా లేదని, చేతిలో చిల్లి గవ్వ కూడా లేని ధీన స్థితిలో ఉన్నారని ఆయన స్నేహితుతు ఒకరు తెలిపారు. అదే విషయం వీడియో ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న సూర్య, తదితరులు ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం దురై స్నేహితుడి ఇంట్లోనే ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇక సూర్య కొంతమంది పిల్లలను కూడా చదివిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ‘సూర్య42’లో నటిస్తున్నారు. 

click me!