రోడ్డు ప్రమాదంలో సినీ యాక్టర్ మృతి.. భార్యకు తీవ్ర గాయాలు

Published : Oct 30, 2019, 11:31 AM ISTUpdated : Oct 31, 2019, 10:43 AM IST
రోడ్డు ప్రమాదంలో సినీ యాక్టర్ మృతి.. భార్యకు తీవ్ర గాయాలు

సారాంశం

భార్యతో కలిసి కారులో వెళుతున్న నటుడు ఊహించని విధంగా రోడ్డు సైడ్ వాల్ ని ఢికొట్టడంతో ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో నటుడు అక్కడిక్కడే మృతి చెందగా అతని భార్య కొన్ని గాయాలతో ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నారు.

బుల్లితెర నటుడు రోడ్ యాక్సిడెంట్ లో మృతి చెందిన ఘటన తమినాడులో లో చోటు చేసుకుంది. భార్యతో కలిసి కారులో వెళుతున్న నటుడు ఊహించని విధంగా రోడ్డు సైడ్ వాల్ ని ఢికొట్టడంతో ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో నటుడు అక్కడిక్కడే మృతి చెందగా అతని భార్య కొన్ని గాయాలతో ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నారు.

అసలు వివరాల్లోకి వెళితే.. గత కొన్నేళ్లుగా పలు సీరియల్స్ ద్వారా, అలాగే మిమిక్రి ఆర్టిస్ట్ గా తమిళనాడు జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ మనో మోహన్‌వేల్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొరట్టూర్, బాబానగర్‌ కి చెందిన మనో సోమవారం స్నేహితుడి ఇంటి నుంచి కారులో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

మనో భార్య కూడా కారులో ఉండడంతో ఆమెకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. సోమవారం రాత్రి సమయంలో ఆవడి సమీపంలో వెళుతుండగా అదుపుతప్పిన కారు రోడ్డు సైడ్‌వాల్‌ను ఢీ కొట్టింది. అక్కడిక్కడే మనో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన అనంతరం స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మనో భార్య లివియను హాస్పిటల్ కి తరలించారు.

మనో మరణించినట్లు తెలుసుకున్న లీవియా హాస్పిటల్ లోనే బోరున విలపించింది. అలాగే తోటి నటీనటులు మనో మృతిపట్ల సంతాపం తెలియజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాపై విచారణ కొనసాగిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?