సుకుమార్ - అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ఆగిపోయిందని కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ ఎట్టకేలకు డీప్ డిస్కర్షన్స్ తో బన్నీ స్క్రిప్ట్ లాక్ చేసుకున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ కి సంబందించిన కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గత కొన్ని నెలలుగా సుకుమార్ - అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ఆగిపోయిందని కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ ఎట్టకేలకు డీప్ డిస్కర్షన్స్ తో బన్నీ స్క్రిప్ట్ లాక్ చేసుకున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ కి సంబందించిన కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆర్య సిరీస్ అనంతరం వీరి కాంబినేషన్ లో సినిమా సెట్టయ్యింది అనగానే ఆడియెన్స్ లో అంచనాల డోస్ తారా స్థాయికి చేరుకుంటోంది. ఇక ఫైనల్ గా సినిమా పూజా కార్యక్రమాలతో సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చారు. నేడు హైదరాబాద్ లో సినిమా లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అల్లు అర్జున్ 20వ సినిమా కావడంతో పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తోంది. ఇక ఎప్పటిలానే సుకుమార్ తన సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. వేడుకలో స్టార్ దర్శకులు కూడా పాల్గొని చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ అందించారు. సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ మొదటి క్లాప్ కొట్టగా సురేందర్ రెడ్డి దర్శకుడు స్క్రిప్ట్ అందించారు.
ఇక కొరటాల శివ కెమెరా స్విచ్ ఆన్ చేసి బన్నీ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.