నా పెళ్ళికి స్వయంవరం ఏర్పాటు చేస్తే ఆ ముగ్గురు హీరోలని పిలుస్తా: తమన్నా

Published : Mar 09, 2020, 03:58 PM IST
నా పెళ్ళికి స్వయంవరం ఏర్పాటు చేస్తే ఆ ముగ్గురు హీరోలని పిలుస్తా: తమన్నా

సారాంశం

మిల్కీ బ్యూటీ తమన్నా అందానికి ఫిదా కానివారంటూ ఉండరు. తమన్నా సౌత్ లో తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా తమన్నా తన గ్లామర్ తోనే సినీ ప్రియులని ఆకర్షించింది.

మిల్కీ బ్యూటీ తమన్నా అందానికి ఫిదా కానివారంటూ ఉండరు. తమన్నా సౌత్ లో తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా తమన్నా తన గ్లామర్ తోనే సినీ ప్రియులని ఆకర్షించింది. తమన్నా దాదాపుగా సౌత్ లోని స్టార్స్ అందరితో నటించింది. ప్రస్తుతం తమన్నా వయసు 30 ఏళ్ళు. దీనితో సహజంగానే పెళ్లి ప్రస్తావన రావడం సహజం. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి తమన్నా సరదా కామెంట్స్ చేసింది. మీ అమ్మ మీ పెళ్లి కోసం స్వయంవరం ఏర్పాటు చేస్తే.. ఎలాంటి వారు స్వయం వరంలో పాల్గొనాలని కోరుకుంటారు.. ఎలాంటి భర్త రావాలి కోరుకుంటారు అని ప్రశ్నించారు. దీనికి తమన్నా ఆసక్తికర సమాధానం ఇచ్చింది. 

చిరంజీవి సర్ కాబట్టే ఒప్పుకున్నా.. ఇక చేయను.. రెజీనా కామెంట్స్!

అదే కనుక జరిగితే నా స్వయంవరానికి హృతిక్ రోషన్, విక్కీ కౌశల్, ప్రభాస్ లని తప్పకుండా పిలవాలని మా అమ్మకు చెబుతా అని తమన్నా ఫన్నీ కామెంట్స్ చేసింది. ఈ ముగ్గురిలో తమన్నా ఇప్పటికే ప్రభాస్ తో రెబల్, బాహుబలి చిత్రాల్లో నటించింది. ఇక హృతిక్ రోషన్ ని ఇష్టపడని అమ్మాయిలు అంటూ ఉండరు. 

ఉరి ది సర్జికల్ స్ట్రైక్ చిత్రంతో గుర్తింపు సొంతం చేసుకున్న విక్కీ కౌశల్ పై తమన్నా గత కొంత కాలంగా  ప్రేమ ఒలకపోస్తోంది. గతంలో కూడా విక్కీ కౌశల్ తో డేటింగ్ చేయాలని ఉన్నట్లు తమన్నా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?