సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణ వార్త యావత్ సినిమా ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. కుటుంబసభ్యులు, అభిమానులు అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాల గురించి పోలీసులు ఆరాతీస్తున్నప్పటికీ... కొన్ని విషయాలు మాత్రం బాలీవుడ్ సర్కిల్స్ నుంచి వెలుగులోకి వచ్చాయి.

ఇండస్ట్రీలోని అనేకమంది ప్రొడ్యూసర్స్ దృష్టిలో సుశాంత్ పై నెగటివ్ ఇమేజ్ ఏర్పడిందట. ఆయన తన నటనకు గాను అధిక పారితోషికాన్ని డిమాండ్ చేయడంతోపాటుగా తన గర్ల్ ఫ్రెండ్ కి కూడా అవకాశాలు ఇవ్వమని ప్రొడ్యూసర్లను సతాయించేవాడట.
undefined
దానితో ఇండస్ట్రీలోని ప్రొడ్యూసర్లు సుశాంత్ అంటేనే వద్దు అనే స్థాయికి చేరుకున్నారట. అతడి విలాసవంతమైన జీవన శైలి, ప్రొడ్యూసర్లతో మంచి రిలేషన్స్ లేకపోవడం వల్ల అతడి పర్సనల్ లైఫ్ లో ఆర్ధిక ఇబ్బందు కూరుకుపోయాడు. హిట్ వచ్చినప్పటికీ.... అతడి ఆర్ధిక పరిస్థితి బాగా దెబ్బతిన్నదట.
అతడి ప్రవర్తన వల్ల అతడి పర్సనల్ స్టాఫ్ కూడా అతడిని వదిలి వెళ్లిపోయారట. అతడు ప్రస్తుతం నివాసముంటున్న సొసైటీ సభ్యులు సైతం ఆయన జీవనశైలి వల్ల ఖాళీ చేయమని చెప్పారట.
మద్యం అధికంగా సేవించడం మొదలుపెట్టాడట. తన ప్రవర్తన వల్ల ఇప్పుడు తనకు సహాయం చేయమని కోరుదామన్నప్పటికీ ఎవ్వరు లేరట. ఈ నేపథ్యంలో ఆయన డిప్రెషన్ కు లోనయ్యాడట. చేతిలో మంచి సినిమాలు లేకపోవడం, ఉన్న భారీ సినిమా "చందమామ దూర్ కే" కాస్తా బడ్జెట్ కారణాలతో అటకెక్కడం అన్ని వెరసి పూర్తి డిప్రెషన్ కి లోనయి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలియవస్తుంది.