
యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అద్భుతమైన నటనతో ఎంతో మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ బలవన్మరణం పలువురిని కంటతడి పెట్టిస్తోంది.
అయితే ఆయన ఆత్మహత్యకు నాలుగు రోజులకు ముందు సుశాంత్ వద్ద మేనేజర్‌గా పనిచేసిన దిశా సలియాన్ సైతం ఆత్మహత్యకు పాల్పడటం అనేక అనుమానాలకు తావిస్తోంది.
Also Read:బిగ్ బ్రేకింగ్: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య
ముంబైలోని మలాడ్‌లో ఓ భారీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న దిశ.. ఈ నెల 10వ తేదీన 14వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే ఆమెను బోరివాలి ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు మరణించినట్లుగా ధ్రువీకరించారు.
అయితే దిశ ఆత్మహత్యకు గల కారణాలు ఇంత వరకు తెలియాల్సి వుంది. పీఆర్‌గా కెరీర్ ప్రారంభించిన దిశా సినీ ప్రముఖులకు మేనేజర్‌గా సేవలందించింది. గతంలో ఐశ్వర్యరాయ్, కమెడియన్ భారతీ శర్మ, హీరోయిన్ రియా చక్రవర్తిలకు మేనేజర్‌గా దిశ పనిచేసింది. ప్రస్తుతం వరుణ్ శర్మ దగ్గర మేనేజర్‌గా పనిచేస్తోంది. దిశ మరణించిన నాలుగు రోజులకే సుశాంత్ సైతం ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది.