వెండితెర `ధోని` సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య

Siva Kodati |  
Published : Jun 14, 2020, 02:39 PM ISTUpdated : Jun 14, 2020, 08:50 PM IST
వెండితెర `ధోని` సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య

సారాంశం

బాలీవుడ్‌లో వరుసగా ప్రముఖుల మరణాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్, రిషీ కపూర్‌ల మరణంతో దిగ్బ్రాంతికి గురైన హింది చిత్ర పరిశ్రమకు మరో షాక్ తగిలింది. యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు

బాలీవుడ్‌లో వరుసగా ప్రముఖుల మరణాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్, రిషీ కపూర్‌ల మరణంతో దిగ్బ్రాంతికి గురైన హింది చిత్ర పరిశ్రమకు మరో షాక్ తగిలింది. యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన వయసు 34 సంవత్సరాలు.

సుశాంత్ ఆదివారం ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బయోపిక్ ద్వారా సుశాంత్ బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌ స్టార్ హీరోగా మంచి ఫాంలో ఉన్న సుశాంత్ ఇలాంటి నిర్ణయం తీసుకోవటంపై సినిమా ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

సూపర్ హిట్ హిందీ సీరియల్ పరిత్రా రిష్తా తో ఎంతో పాపులారిటీ సాధించాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌. ఆ షో తో వచ్చిన పాపులారిటో 2013లో కై పో చే సినిమాతో వెండితెర అరంగేట్రం చేశాడు. ఆమిర్‌ ఖాన్ సూపర్‌ హిట్ సినిమా పీకేలోనూ కీలక పాత్రలో నటించాడు సుశాంత్.

ఇండియన్‌ క్రికెట్‌ టీం మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆదారంగా తెరకెక్కిన ఎంఎస్‌ ధోని సినిమాతో సుశాంత్ స్టార్ ఇమేజ్‌ అందుకున్నాడు, ఈ సినిమా ఘన విజయం  సాధించటంతో పాటు నటుడిగా సుశాంత్ స్థాయిని ఎన్నో రెట్లు పెంచింది. ఆ తరువాత చేసిన కేధార్‌నాథ్ సినిమా కమర్సియల్ గా వర్క్ అవుట్ కాకపోయిన సుశాంత్ నటనకు మాత్రం మంచి పేరు వచ్చింది.

తరువాత సోంచిరియా, చిచోరే సినిమాలతో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో లాక్‌ డౌన్‌కు ముందు దిల్‌ బెచర సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. ఆయన మరణవార్తతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. మరిన్ని వివరాలు తెలియాల్సి  వుంది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?