దిల్ రాజుకే “గుంటూరు కారం” నైజాం రైట్స్, షాకింగ్ ప్రైస్

Published : Jun 24, 2023, 06:48 PM IST
 దిల్ రాజుకే  “గుంటూరు కారం” నైజాం రైట్స్, షాకింగ్ ప్రైస్

సారాంశం

ఈ సినిమా షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నా తగ్గేదేలే అన్నట్లు జనాల నోట్లో నానుతోంది. ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందా, ఎప్పుడు చూద్దామా ..

మహేష్ బాబు (MaheshBabu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' #GunturKaram కు ఓ రేంజిలో క్రేజ్ క్రియేట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నా తగ్గేదేలే అన్నట్లు జనాల నోట్లో నానుతోంది. ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందా, ఎప్పుడు చూద్దామా అన్నట్లు  మహేష్ బాబు అభిమానులు ఎదురు చూస్తున్నారు.  ఈ క్రేజ్ ని చూసిన , డిస్ట్రిబ్యూటర్స్ లో ఉత్సాహం మొదలైంది. ట్రేడ్ లో కదలిక వచ్చింది. 

 గుంటూరు కారం  నైజాం హక్కులని  దిల్ రాజు 42 కోట్లకి పైగా వెచ్చించి సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది.  ఓ రీజనల్ సినిమాతో ఈ రేంజ్ భారీ బిజినెస్ జరగడం అనేది రికార్డ్ అనే చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ ఈ రోజు సైలెంట్ గా హీరో కు వేసిన ఇంటి సెట్ లో మొదలైంది. 

మహేష్ బాబు, ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న శ్రీలీల (Sreeleela), అలాగే ఇంకో హీరోయిన్ గా నటిస్తున్న మీనాక్షి చౌదరి (MeenakshiChaudhary), రఘుబాబు (Raghubabu), వెన్నెల కిషోర్ (VennelaKishore) లు ఈరోజు షూటింగ్ లో పాల్గొన్నారు తెలిసింది. వీరందిమీద చాలా కీలకమైన సన్నివేశాలు ఈరోజు ఉదయం నుండి తీసారని కూడా సమాచారం.

అలాగే షూటింగ్ కూడా హైద్రాబాద్ లోనే జరుగుతోందని, ఇప్పుడు ఏ హడావిడి లేకుండా తీస్తున్నారని, ఇది కొన్ని రోజులు కంటిన్యూ అవుతుందని కూడా తెలిసింది. జులై మొదటి వారం నుండి మరికొందరు క్యారెక్టర్ నటులు కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని, ఇంకా చాలా కాంబినేషన్ సన్నివేశాలు వుంటాయని కూడా తెలిసింది. ఈ సినిమా నుండి ఇప్పటికే పూజ హెగ్డే తప్పుకున్న సంగతి కూడా తెలిసిందే.ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?