#AAGMC: కొనుక్కున్న వాళ్లు గోలెత్తిపోతున్నారు...ఎంత లాస్ అంటే ....?

By Surya PrakashFirst Published Sep 20, 2022, 11:26 AM IST
Highlights

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రానికి రూ.7.74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఇప్పుడు వరకూ వచ్చిన కలెక్షన్స్ ని బట్టి  బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. 


సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.’మైత్రీ మూవీ మేకర్స్‌’ తో కలిసి ‘బెంచ్‌మార్క్ స్టూడియోస్‌’ పై నిర్మాతలు బి మహేంద్ర బాబు, కిరణ్ బళ్లపల్లి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించగా… గాజులపల్లె సుధీర్ బాబు చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించారు.సినిమా పరిశ్రమకు సంబంధించిన కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.  సెప్టెంబర్ 16న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం  పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. మార్నింగ్ షో నుంచే  సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ పరంగా సినిమా నిలబడలేదు. ఈ నేపధ్యంలో  ఈచిత్రానికి ఎంత బిజినెస్ జరిగింది..ఎంత నష్టం వచ్చిందో చూద్దాం.  

  ఇంద్రగంటి దర్శకత్వం వహించిన సినిమా కావడంతో బాగానే బిజినెస్ జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం    2.50 cr
సీడెడ్    1.50 cr
ఉత్తరాంధ్ర    1.20 cr
ఈస్ట్    0.30 cr
వెస్ట్    0.28 cr
గుంటూరు    0.38 cr
కృష్ణా    0.46 cr
నెల్లూరు    0.27 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)    6.89 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా    0.35 cr
ఓవర్సీస్    0.50 cr
వరల్డ్ వైడ్ (టోటల్)    7.74 cr

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రానికి రూ.7.74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఇప్పుడు వరకూ వచ్చిన కలెక్షన్స్ ని బట్టి  బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. అతి కష్టమీద మూడు కోట్లు దాకా రికవరీ ఉండవచ్చని చెప్తున్నారు.  నిర్మాతలు థియేటర్లలో విడుదల చేయడం వల్ల 5 కోట్లు పైగానే నష్టపోయే అవకాశం ఉందని అంటున్నారు. అయితే నిర్మాతకు ఓటిటిల ద్వారా కొంతలో కొంత రికవరీ ఉంటుందని చెప్తున్నారు.

click me!