Thipparaa Meesam:'తిప్పరా మీసం' ట్విట్టర్ రివ్యూ!

Published : Nov 08, 2019, 09:46 AM IST
Thipparaa Meesam:'తిప్పరా మీసం' ట్విట్టర్ రివ్యూ!

సారాంశం

ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కొంతమేరకు అంచనాలను క్రియేట్ చేయగలిగింది. సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. దర్శకుడు విజయ్ కృష్ణ రూపొందించిన ఈ సినిమా నిక్కీ తంబోలీ హీరోయిన్ గా నటించింది.

నటుడు శ్రీవిష్ణు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా తనకు ఏ పాత్ర సూట్ అవుతుందో ఆ పాత్రలో నటిస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తున్నాడు. మొదటినుండి కూడా వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. తాజాగా ఈ హీరో నటించిన 'తిప్పరా మీసం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కొంతమేరకు అంచనాలను క్రియేట్ చేయగలిగింది. సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. దర్శకుడు విజయ్ కృష్ణ రూపొందించిన ఈ సినిమా నిక్కీ తంబోలీ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా కొన్ని చోట్ల ప్రదర్శించడంతో నెటిజన్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

హీరోతో ఎఫైర్.. కౌంటర్ ఇచ్చిన రష్మికా మందన్నా

 ఓవరాల్ గా చూసుకుంటే సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో తల్లీకొడుకుల సెంటిమెంట్ వర్కవుట్ అయిందని.. శ్రీవిష్ణు, రోహిణి ఆ పాత్రల్లో జీవించేశారని అంటున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ నేరేషన్ బాగుందని..  సెకండ్ హాఫ్ ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ అధ్బుతంగా ఉందని అంటున్నారు. 

ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకి హైలైట్ గా నిలిచిందని చెబుతున్నారు. బీజియమ్ ప్రతీ సన్నివేశాన్ని ఎలివేట్ చేసిందని టాక్. 'ఛత్రపతి' సినిమా తరువాత టాలీవుడ్ లో ఆ రేంజ్ లో అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన సినిమా ఇదేనని, ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయని చెబుతున్నారు.

స్క్రీన్ ప్లే స్లోగా సాగినప్పటికీ మొత్తంగా చూసుకుంటే సినిమా మెప్పిస్తుందని అంటున్నారు. ట్విట్టర్ టాక్ ని బట్టి అయితే శ్రీవిష్ణు హిట్ అందుకున్నట్లే కనిపిస్తోంది. మరి పూర్తి స్థాయిలో షోలు పడిన తరువాత ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి!

 

 

 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?