శ్రీలీల కు సూపర్ ఛాన్స్.. హిట్టైతే పాతుకుపోయినట్లే

 శ్రీ లీల మరో క్రేజీ ప్రాజెక్టు కమిటైనట్లు తెలుస్తోంది.   త్వరలో ప్రారంభం కానున్న...



తెలుగు బ్యూటీ శ్రీలీల హిట్, ప్లాఫ్ లకు సంభందం లేకుండా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అంతేకాకుండా ఇతర భాషలపైనా కన్నేసింది. త్వరలో ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. అలాగే ఇప్పుడు  శ్రీ లీల మరో క్రేజీ ప్రాజెక్టు కమిటైనట్లు తెలుస్తోంది.   త్వరలో ప్రారంభం కానున్న శివకార్తికేయన్ 25వ చిత్రంలో శ్రీలీల  హీరోయిన్ గా కనిపించే అవకాసం ఉంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి స్టార్ డైరక్టర్ సుధా కొంగర దర్శకత్వం వహించనున్నారు.

ఇంకా టైటిల్  పెట్టని ఈ చిత్రంలో మరో స్టార్ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. శివకార్తికేయన్‌కు జోడీగా శ్రీలీలను ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే వీళ్లిద్దరిపై ఫొటోషూట్‌ పూర్తి చేసినట్లు ప్రచారం వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.

Latest Videos

‘గురు, ఆకాశం నీ హద్దు రా’ వంటి చిత్రాలతో దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధ కొంగర తెరకెక్కించనుండటంతో ఈ ప్రాజెక్టుకు మంచి క్రేజ్ రానుంది.  త్వరలో అధికారికంగా ప్రకటిస్తుందట చిత్ర టీమ్. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో సూర్య హీరోగా నటించాల్సి ఉండగా ఆయన తప్పుకున్న నేపథ్యంలో శివకార్తికేయన్‌ని తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. సూర్యతో ‘పురనానూరు’ అనే టైటిల్‌తో తెరకెక్కించనున్నట్లు పేర్కొన్నారు. మరి.. శివ కార్తికేయన్‌తో అనుకుంటున్నది ఈ చిత్రమేనా?  కాదా అనే విషయం తెలియాల్సి ఉంది.   పురాణనూరు చిత్రానికి జివి ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించనున్నారు.
 

click me!