దిగొచ్చిన జబర్దస్త్ హైపర్ ఆది: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు

By telugu teamFirst Published Jun 16, 2021, 7:01 AM IST
Highlights

స్కిట్ లో చేసిన అనుచిత వ్యాఖ్యలపై జబర్దస్త్ నటుడు హైపర్ ఆది దిగిరాక తప్పలేదు. తాను ఇచ్చిన వివరణతో తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ప్రతినిధులు సంతృప్తి చెందకపోవడంతో ఆయన క్షమాపణ చెప్పారు.

హైదరాబాద్: జబర్దస్త్ నటుడు హైపర్ ఆది దిగొచ్చి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. బతుకమ్మ, గౌరవమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన ఆ క్షమాపణలు చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ అనే తేడాలు తమ షోలో ఎప్పుడూ ఉండవని, అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటూ పోతామని ఆయన చెప్పారు. 

శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసి స్కిట్ మీద తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దానిపై హైదరాబాదులోని ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. మంగళవారం ఉదయం దానిపై ఫోన్ కాల్ విద్యార్థి విభాగం ప్రతినిధులకు వివరణ ఇచ్చారు.

ఆ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని ఆయన చెప్పారు. అయితే బేషరతుగా క్షమాపణలు చెప్పేదా వరకు కూడా తాము వదలిపెట్టబోమని, ఆవసరమైతే న్యాయపరంగా వెళ్తామని వారు హెచ్చరించారు.

ఆ హెచ్చరికలతో హైపర్ ఆది క్షమాపణలు చెబుతూ మంగళవారం రాత్రి ఓ వీడియో విడుదల చేశారు. ఆ షోలో చేసిన స్కిట్ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయని, అవి తాము కావాలని చేసినవి కావని హైపర్ ఆదిచెప్పారు. అన్ని ప్రాంతాల వారి ప్రమే, అభిమానంతోనే తాము వారికి వినోదం పంచుతున్నట్లు ఆయన తెలిపారు ఇటీవల షోలో జరిగినదానికి క్షమాపణ కోరుతున్నట్లు ఆయన తెలిపారు. 

click me!