బన్నీతో అనుకున్నది వేరే హీరోతో మొదలెట్టేస్తున్నారు!

By AN Telugu  |  First Published Feb 12, 2020, 5:02 PM IST

‘సోను కే టిటు కి స్వీటీ’ సినిమాకు అల్లు శిరీష్ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ కొంతకాలం నడిచిందిట. అయితే అల్లు శిరీష్ ఇప్పుడు తానో తమిళ రీమేక్ చేస్తున్నాను కాబట్టి, దాన్ని చేసే ఉద్దేశ్యం లేదని చెప్పేసాడట. 


కొన్ని ప్రాజెక్టులు ప్రారంభంలో ఓ హీరో ఉంటారు. చివరకు వచ్చేసరికి రకరకాల కారణాలతో వేరే హీరో సీన్ లోకి వస్తారు. అలాంటిదే ఇప్పుడు ఓ సినిమా ప్రారంభం కాబోతోంది. బాలీవుడ్లో హిట్ట‌యిన సోనూ కీ టిటు కీ స్వీటీని రీమేక్ చేయాల‌ని బ‌న్నీ, త్రివిక్ర‌మ్ ప్లాన్ చేసినట్లుగా ప్రచారం జరిగింది అప్పట్లో. ఆ చిత్రం రైట్స్ సైతం గీతా ఆర్ట్స్ దగ్గరే ఉన్నాయి. అల్లు అర్జున్ కు సైతం ఆ సినిమా తెగ నచ్చేసింది.

అయితే త్రివిక్రమ్ కు రీమేక్ చేయటం ఇష్టం లేకపోవటంతో  వీళ్లిద్ద‌రి క‌ల‌యిక‌లో అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం వచ్చింది. అయితే ఇష్టపడి కొనుక్కున్న ఆ సినిమా రీమేక్ రైట్స్ ని ఏం చేయాలి. వేస్ట్ కాకుండా ఉండటం కోసం దాన్ని వేరే హీరోతో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Latest Videos

undefined

త్రివిక్రమ్ vs రాజమౌళి.. బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్


‘సోను కే టిటు కి స్వీటీ’ సినిమాకు అల్లు శిరీష్ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ కొంతకాలం నడిచిందట. అయితే అల్లు శిరీష్ ఇప్పుడు తానో తమిళ రీమేక్ చేస్తున్నాను కాబట్టి, దాన్ని చేసే ఉద్దేశ్యం లేదని చెప్పేసాడట. దాంతో అల్లు అరవింద్ ఎక్కువ కాలం దాన్ని తమ దగ్గర పెట్టుకుంటే వేరే ఎవరైనా ఆ ప్లాట్ లేపేసే అవకాసం ఉంది, అలాగే సినిమా పాతబడిపోతుందని వెంటనే వేరే హీరోతో అయినా పట్టాలు ఎక్కించాలని ఫిక్స్ అయ్యారట.

బన్ని కూడా అదే చెప్పారట. ఈ నేపధ్యంలో ఈ సినిమాకు సెట్ అయ్యే హీరో కోసం ఇప్పుడు గీతా ఆర్ట్స్ బ్యానర్ అన్వేషణలో ఉందట. బన్ని వాసు చేతిలో ఈ ప్రాజెక్టుని పెట్టారట. త్వరలోనే హీరోని సెట్ చేసి ఈ ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించే ఆలోచనలో బన్ని వాసు ఉన్నారట.

అల్లు అర్జున్ మాట్లాడుతూ...‘సోను కే టిటు కి స్వీటీ’ అనేది గీతా ఆర్ట్స్‌లో  రీమేక్ చేద్దామని అడిగారు. చాలామంది అది నాకోసమని అనుకున్నారు. అయితే అది నా కోసం కాదు. దాన్ని రీమేక్ చేస్తే బాగుంటుందా? అని నేను వ్యక్తిగతంగా కూడా  ఆలోచించా. ఆ సమయంలో త్రివిక్రమ్ గారు, నేనూ కలిసి ఒక స్టోరీ అనుకున్నాం. రెండు స్టోరీల్లో మేమనుకున్నదే బెటర్ అనిపించింది. అందుకే ఆ సినిమా జోలికి వెళ్లకుండా ఈ స్టోరీతోనే ముందుకెళ్లాం అన్నారు.

‘సోను కే టిటు కీ స్వీటీ’ చిత్రాన్ని లవ్ రంజన్ అనే దర్శకుడు రూపొందించారు. ఇదో రొమాంటిక్ కామెడీ మూవీ . కార్తీక్ ఆర్యన్.. నుష్రత్ భరూచా.. సన్నీ నిజార్ ప్రధాన పాత్రలు పోషించారు. పూర్తి ఎంటర్టైన్మెంట్ తో సాగే సినిమా ఇది. ఈ చిత్రం యుత్ కు బాగా పట్టింది. క్రితం సంవత్సరం ఫిబ్రవరి 23న రిలీజైన ఈ చిత్రం  60 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం.  

 

click me!