డబ్బున్న వాళ్లే విడాకులు తీసుకుంటారు.. చెత్త వ్యాఖ్యలపై సోనమ్ ఫైర్!

By telugu news teamFirst Published Feb 17, 2020, 2:21 PM IST
Highlights

ఆదివారం నాడు అహ్మదాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మోహన్ భగవత్.. ఉన్నత విద్యావంతుల కుటుంబాల్లోనే ఎక్కువగా విడాకుల కేసులు నమోదవుతున్నాయని.. చిన్న చిన్న విషయాలకే కొట్లాడుకొని విడిపోతున్నారంటూ విమర్శించారు.

బాగా చదువుకున్న వారే విడాకుల వైపు మొగ్గు చూపుతున్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం(ఆరెస్సెస్‌) చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తెలివి తక్కువ మాటలు ఎలా మాట్లాడతారంటూ మండిపడ్డారు.

ఆదివారం నాడు అహ్మదాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మోహన్ భగవత్.. ఉన్నత విద్యావంతుల కుటుంబాల్లోనే ఎక్కువగా విడాకుల కేసులు నమోదవుతున్నాయని.. చిన్న చిన్న విషయాలకే కొట్లాడుకొని విడిపోతున్నారంటూ విమర్శించారు.

అవార్డులకు RIP అంటున్న పవన్ హీరోయిన్.. సీరియస్ కామెంట్స్!

''ఈరోజుల్లో విడాకుల కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. చిన్న చిన్న విషయాల కోసం విడాకుల వరకు వెళ్తున్నారు. ముఖ్యంగా బాగా చదువుకున్న వాళ్లు, ఐశ్వర్యవంతులైన వారే విడాకులు తీసుకుంటున్నారు. విద్య, డబ్బుతో పొగరుబట్టిన కారణంగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. దాంతో కుంటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి. సమాజంలో కూడా అంతరాలు పెరిగిపోతున్నాయి'' అంటూ చెప్పుకొచ్చారు.

మోహన్ భగవత్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోనమ్ కపూర్ మండిపడింది. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. 'ఈ మనిషి అసలు ఇలా ఎలా మాట్లాడతారు..? ఇవి పూర్తిగా తెలివితక్కువ, వెనుకబాటుతనాన్ని సూచించే మాటలు' అంటూ ఫైర్ అయ్యారు.  
 

Which sane man speaks like this? Regressive foolish statements https://t.co/GJmxnGtNtv

— Sonam K Ahuja (@sonamakapoor)
click me!