కరోనా ఎఫెక్ట్: భర్తతో శ్రీయ.. వైరల్ అవుతున్న చిలిపి వీడియో

Published : Apr 10, 2020, 04:45 PM IST
కరోనా ఎఫెక్ట్: భర్తతో శ్రీయ.. వైరల్ అవుతున్న చిలిపి వీడియో

సారాంశం

లాక్ డౌన్ కారణంగా సామాన్య ప్రజలు, సెలెబ్రిటీలు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీనితో అభిమానులని ఆకట్టుకునేందుకు సినీ తారలు సోషల్ మీడియా వేదికగా ప్రయత్నిస్తున్నారు.

లాక్ డౌన్ కారణంగా సామాన్య ప్రజలు, సెలెబ్రిటీలు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీనితో అభిమానులని ఆకట్టుకునేందుకు సినీ తారలు సోషల్ మీడియా వేదికగా ప్రయత్నిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో తాము ఇంట్లో ఎలా గడుపుతున్నామో తెలియజేస్తూ.. ఆ వీడియోలు , ఫోటోలు అభిమానులతో పంచుకుంటున్నారు. 

చాలా మంది హీరోయిన్లు తమ నివాసాల్లో వంటలు చేస్తున్న వీడియోలు పంచుకుంటున్నారు. కానీ శ్రీయ, ఆమె భర్త ఆండ్రీ కొశ్చివ్ విభిన్నంగా ప్రయత్నించారు. తమ వీడియోతో నెటిజన్లని అలరించారు. 

హీరో విక్రమ్ పై రూమర్స్.. అభిమానుల్లో కంగారు

శ్రీయ 'స్టే హోమ్.. స్టే సేఫ్ అని రాసి ఉన్న ప్లకార్డుని కెమెరాకు చూపిస్తుండగా.. ఆమె భర్త చిలిపిగా వెనుక నుంచి 'ఈమె నుంచి నన్ను రక్షించండి' అనే ప్లకార్డు చూపించాడు. ఈ వీడియో నెటిజన్లకు నవ్వులు పూయింస్తోంది. 

2018లో శ్రీయ రష్యాకు చెందిన ఆండ్రీ కొశ్చివ్ ని చాలా రహస్యంగా వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులు అన్యోన్యంగా జీవిస్తున్నారు. శ్రీయ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది. శ్రీయ చివరగా తెలుగులో పైసా వసూల్, గాయత్రీ లాంటి చిత్రాల్లో మెరిసింది. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?