హీరో విక్రమ్ పై రూమర్స్.. అభిమానుల్లో కంగారు

Published : Apr 10, 2020, 04:02 PM IST
హీరో విక్రమ్ పై రూమర్స్.. అభిమానుల్లో కంగారు

సారాంశం

సౌత్ లో ఉన్న విలక్షణ నటుల్లో విక్రమ్ కూడా ఒకరు. అభిమానులు ముద్దుగా చియాన్ విక్రమ్ అని పిలుచుకునే ఈ హీరో ప్రతిభకు జాతీయ అవార్డు కూడా దాసోహమైంది.

సౌత్ లో ఉన్న విలక్షణ నటుల్లో విక్రమ్ కూడా ఒకరు. అభిమానులు ముద్దుగా చియాన్ విక్రమ్ అని పిలుచుకునే ఈ హీరో ప్రతిభకు జాతీయ అవార్డు కూడా దాసోహమైంది. అపరిచితుడు, శివపుత్రుడు లాంటి చిత్రాలు చూస్తే విక్రమ్ నటన ఏపాటిదో అర్థం అవుతుంది. 

తాజాగా విక్రమ్ గురించి ఓ షాకింగ్ రూమర్ వైరల్ అవుతూ అభిమానులని కంగారు పెడుతోంది. త్వరలో విక్రమ్ నటనకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ఈ వార్తల సారాంశం. విక్రమ్ తన కొడుకు ధృవ్ ని స్టార్ ని చేయాలనీ డిసైడ్ అయ్యాడని.. ఇకపై ధృవ్ సినిమాలపై ఫోకస్ పెట్టేందుకు విక్రమ్ నటనకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

బాలయ్యతో జూ.ఎన్టీఆర్ హీరోయిన్.. ఆ సంచలన నటి కూడా..

దీనితో విక్రమ్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. అపరిచితుడు చిత్రంతో విక్రమ్ సౌత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. జరుగుతున్న ప్రచారంపై విక్రమ్ పీఆర్ టీం స్పందించింది. అదంతా అసత్య ప్రచారం అని.. విక్రమ్ భవిష్యత్తులో కూడా తన నటనతో అలరిస్తాడని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం విక్రమ్ యాక్షన్ థ్రిల్లర్ కోబ్రా మూవీలో, మణిరత్నం దర్శత్వంలో పొన్నియన్ సెల్వం చిత్రంలో నటిస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?