ఈమె యోగా ఫీట్లు చాలా డేంజర్.. ఎవరూ ట్రై చేయొద్దే!

Published : Apr 17, 2020, 01:32 PM IST
ఈమె యోగా ఫీట్లు చాలా డేంజర్.. ఎవరూ ట్రై చేయొద్దే!

సారాంశం

సెలెబ్రిటీలలో యోగాసనాలు మొదటగా క్రేజ్ తీసుకువచ్చింది శిల్పా శెట్టి. శిల్పా శెట్టి ఓయోగాసనాలు చేస్తున్న వీడియోల్ని ఒకానొక సమయంలో యువత ఎగబడి చూశారు. 44 ఏళ్ల వయసులో కూడా శిల్పా శెట్టి నాజూకైన అందంతో ఆకట్టుకుంటోందంటే అందుకు కారణం యోగానే అని చెప్పొచ్చు. 

పెళ్ళై తల్లయినప్పటికీ ఈ పొడుగు కాళ్ళ సుందరి గ్లామర్ తో మెరిసిపోతోంది. తాజాగా శిల్పా శెట్టి యోగాసనాలు వేస్తున్న వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. శిల్పాల శెట్టి ఈ వయసులో కూడా ఇలాంటి డేంజర్ ఆసనాలు సులువుగా వేయడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 

కలియుగంలో కనిపించే సీత.. చెల్లెళ్ళతో ఫోటో, ఇంటర్నెట్ లో వైరల్!

బ్లూ జిమ్ డ్రెస్ లో శిల్పా శెట్టి యోగాసనాలు వేసింది. 44ఏళ్ల వయసులో శిల్పా శెట్టి రబ్బరు బొమ్మలా తన శరీరాన్ని ఎలా కావాలంటే అలా వంచుతోంది. క్వారంటైన్ లో శిల్పా శెట్టి యోగాతో, తన సరోగసి బేబీతో గడుపుతోంది. ఇలాంటి సాహసోపేతమైన యోగా ఫీట్లు శిల్పా శెట్టికి మాత్రమే సాధ్యం అని.. ఎవరూ ట్రై చేయొద్దని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

నిజమే మరి.. శిల్పా శెట్టిలాగా యోగాసనాలు చేయాలంటే ఒక్కరోజులో కుదరదు.. చాలా సాధన అవసరం. వివాహం తర్వాత శిల్పా శెట్టి సినిమాల జోరు తగ్గించిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?