టాలీవుడ్ యంగ్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. స్టార్ హీరోతో రొమాన్స్!

Published : Dec 11, 2019, 03:33 PM IST
టాలీవుడ్ యంగ్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. స్టార్ హీరోతో రొమాన్స్!

సారాంశం

అర్జున్ రెడ్డి చిత్రంతో యంగ్ బ్యూటీ షాలిని పాండే సెన్సేషన్ గా మారిపోయింది. తొలి చిత్రంతోనే బోల్డ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది. ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్ తో నటించి యువత హృదయాల్లో అలజడి సృష్టించింది.

అర్జున్ రెడ్డి చిత్రంతో యంగ్ బ్యూటీ షాలిని పాండే సెన్సేషన్ గా మారిపోయింది. తొలి చిత్రంతోనే బోల్డ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది. ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్ తో నటించి యువత హృదయాల్లో అలజడి సృష్టించింది. అర్జున్ రెడ్డి మూవీ ఘనవిజయం సాధించినప్పటికీ షాలిని పాండేకు అవకాశాలు వెల్లువెత్తలేదు. 

షాలిని పాండే చిన్న చిత్రాల్లో మాత్రమే నటిస్తోంది. యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న షాలిని పాండేకు అర్జున్ రెడ్డి తర్వాత అంతటి సక్సెస్ కూడా లభించలేదు. మంచి ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో షాలిని పాండేకు జాక్  పాట్ లాంప్ ఆఫర్ దక్కింది. బాలీవుడ్ క్రేజీ హీరో రణ్వీర్ సింగ్ సరసన జయేష్ భాయ్ జోర్దార్ చిత్రంలో షాలిని నటించబోతోంది. 

మహిళా సాధికారత అనే అంశంపై దివ్యాంగ్ థక్కర్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తుండడం విశేషం. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ షాలిని పాండే తమ బ్యానర్ లో బాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమవుతుండడంపై స్పందించింది. అనుష్క శర్మ, భూమి పెడ్నేకర్ లాంటి హీరోలు తమ బ్యానర్ లో హీరోయిన్ గా పరిచయమై స్టార్స్ గా ఎదిగారు. 

అలిగి వెళ్లిపోయిన స్టార్ హీరో.. అర్జున్ రెడ్డి రీమేక్ కు ఝలక్!

షాలిని పాండే కూడా బాలీవుడ్ లో విజయవంతం కావాలని తాము కోరుకుంటున్నట్లు యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ పేర్కొంది. తనకు వచ్చిన బంపర్ ఆఫర్ పై షాలిని మాట్లాడుతూ.. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ బ్యానర్ లో నటించడం ఏ నటులకైనా ఒక డ్రీమ్. నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు చెబుతున్నా. ఈ జనరేషన్ సూపర్ స్టార్స్ లో రణవీర్ సింగ్ ఒకరు. ఆయనతో కలసి నటించేందుకు చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు షాలిని తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?