హాలీవుడ్ ఫార్ములా వల్లే రాజమౌళికి సక్సెస్.. రజనీ క్లాస్ పీకారు: హీరో సుమన్

By tirumala ANFirst Published Jan 30, 2020, 1:34 PM IST
Highlights

హీరో సుమన్ ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర నటుడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో సుమన్ కెరీర్ ని ఇబ్బందులు వెంటాడాయి. ఫలితంగా సుమన్ వెనుకబడిపోయాడు. ప్రస్తుతం సుమన్ తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు.

హీరో సుమన్ ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర నటుడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో సుమన్ కెరీర్ ని ఇబ్బందులు వెంటాడాయి. ఫలితంగా సుమన్ వెనుకబడిపోయాడు. ప్రస్తుతం సుమన్ తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. ఇటీవల సుమన్ కమెడియన్ అలీ నిర్వహించే ఓ షోకు అతిథిగా హాజరయ్యాడు. 

ఈ షోలో తన కెరీర్ గురించి అనేక అంశాలు ప్రస్తావించారు.ఈ సందర్భంగా రాజమౌళి, రజనీకాంత్ పై సుమన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. శివాజీ తర్వాత తెలుగులో విలన్ గా నటించే ఛాన్స్ రాలేదా అని అలీ ప్రశ్నించాడు. దానికి సుమన్ సమాధానం ఇస్తూ.. వచ్చాయి కానీ మంచి పాత్ర కుదరాలి కదా.. అందుకే చేయలేదు. 

శివాజీ చిత్రంలో విలన్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుంది. సినిమా మొత్తం విలన్ పాత్రే డామినేట్ చేస్తుంది. చివర్లో హీరో డామినేట్ చేస్తాడు. ప్రస్తుతం ఈ తరహాలో సినిమాలు చేస్తున్నది రాజమౌళి ఒక్కరే. ఆయన చిత్రాల్లో విలన్ రోల్స్ అద్భుతంగా ఉంటాయి. అది హోలీవడ్ ఫార్ములా. మొదట విలన్ డామినేట్ చేయాలి.. ఆ తర్వాత హీరోయిజం ఉండాలి. ఇది ఎప్పటికైనా సక్సెస్ ఫార్ములానే అని సుమన్ అన్నారు.  

బోల్డ్ ఇమేజ్ ని వదిలిపెట్టను.. పాయల్ రాజ్ పుత్ హాట్ కామెంట్స్!

శివాజీ షూటింగ్ సమయంలో రజనీకాంత్ తో గడపిన సమయం మరిచిపోలేనిది అని సుమన్ అన్నారు. ఆ చిత్ర షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ యూనిట్ లంచ్ కోసం అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ పంపారు. అక్కడే రజనీకాంత్ కూడా ఉన్నారు. శనివారం కావడంతో నేను నాన్ వెజ్ తినను అని చెప్పా. రజని ఎందుకని ప్రశ్నించారు.

'మిర్చి' ఐటెం భామ గ్లామర్ హీట్ తట్టుకోగలరా.. ఫొటోస్ వైరల్ 

వెంకటేశ్వర స్వామి పాత్ర చేశాను కదా.. సెంటిమెంట్ అని చెప్పా. వెంకటేశ్వర స్వామి నాన్ వెజ్ తినొద్దు అని నీకు ఫోన్ చేశారా అని రజని అన్నారు. నేనొక్కడినే ఎలా తింటాను.. నువ్వు కూడా తిను.. మనసుని మాత్రం వెజిటేరియన్ గా ఉంచుకో. ఇంకొకరికి మంచి చెయ్. నీకు దక్కాల్సినవి ఆ భగవంతుడే చూసుకుంటాడు అని రజని చెప్పారు. అప్పటి నుంచి ఆ సెంటిమెంట్ వదిలేశా. పండగలు, గుడికి వెళ్లే సమయంలో మాత్రం నాన్ వెజ్ తినను అని సుమన్ అన్నారు. 

click me!