ఆ దెబ్బతో సినిమాలకు దూరమైన గీతాంజలి.. అన్నగారు చెప్పినా వినకుండా..

By Prashanth MFirst Published Oct 31, 2019, 8:55 AM IST
Highlights

మొదటి సీతగా అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్న సీనియర్ నటి గీతాంజలి. 400కి పైగా సినిమాల్లో నటించిన గీతాంజలి సీనియర్ నటుడైన రామకృష్ణ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే 1972కాలం మారింది అనంతరం ఆమె చాలా వరకు సినిమాలకు దూరంగా ఉన్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సీతగా అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్న సీనియర్ నటి గీతాంజలి. 400కి పైగా సినిమాల్లో నటించిన గీతాంజలి సీనియర్ నటుడైన రామకృష్ణ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే 1972కాలం మారింది అనంతరం ఆమె చాలా వరకు సినిమాలకు దూరంగా ఉన్నారు.

పెళ్లి తరువాత కుటుంబ జీవితానికి కాలాన్ని కేటాయించారు. ఆమె ఒక కుమారుడు ఉన్నాడు.  అయితే ఆమె కెరీర్ లో పదేళ్లకు పైగా సినిమాలకు దూరమవ్వడానికి ఒక ఊహించని నష్టమే కారణమని గతంలో చెప్పారు. ఒక కన్నడ సినిమాను చూసిన ఆమె ఆ సినిమాను ఎలాగైనా తెలుగులో రీమేక్ చేయాలనీ స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు.

భర్త రామకృష్ణతో చెప్పి సినిమాను ఎలాగైనా తెలుగులో తీయాలని గొడవపెట్టుకున్నారు. ఇక ఫైనల్ గా రామకృష్ణ సినిమాను మొదలుపెట్టారు.  చంద్ర మోహన్ - సుజాత - రామకృష్ణ నటించిన ఆ సినిమా పేరు  రామ పురంలో సీత. ధవళ సత్యం గారు దర్శకత్వం వహించిన ఆ సినిమా 1981లో రిలీజయింది.

సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు సీనియర్ ఎన్టీఆర్ ని ముఖ్య అతిధిగా పిలవాలని అనుకున్నారు. కానీ ఆయన సినిమాలను నిర్మించవద్దని గట్టిగా చెప్పారు. సినిమా ఓపెనింగ్ కి కూడా రాలేదు.  అయినప్పటికీ గీతాంజలి భర్తతో కలిసి ఆ రోజుల్లో 25లక్షలకు పైగా ఖర్చు చేసి సినిమాను నిర్మించారు.

సినిమా రిలీజ్ అనంతరం 30లక్షలకు పైగా నష్టాలతో భారీగా దెబ్బతిన్నారు. ఆ దెబ్బతో మళ్ళి కొన్నేళ్ళవరకు గీతాంజలి వెండి తెరవైపు చూడలేదు. ఆ సినిమా నష్టాలను మిగిల్చడంతో మా ఆయన కూడా కోప్పడ్డారని, అనంతర సినిమాల జోలికి వెళ్లలేదని గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

also read: సీనియర్ నటి గీతాంజలి కన్నుమూత

click me!