'సైరా' చూడరని చిరుకి ముందే చెప్పా కానీ.. నటుడు గిరిబాబు కామెంట్స్!

By AN TeluguFirst Published Nov 27, 2019, 9:55 AM IST
Highlights

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేకపోయింది. బయ్యర్లు కూడా ఈ సినిమా వలన కొంతమేరకు నష్టపోయారని సమాచారం. అయితే చిత్రబృందం ఈ సినిమాని హిట్ అనే చెప్పుకుంటూ వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' సినిమా యూత్ కి కనెక్ట్ అవ్వదని.. ఇప్పటి జెనరేషన్ ఆ సినిమా చూడరని చిరంజీవికి ముందే చెప్పానని సీనియర్ నటుడు గిరిబాబు సంచలన కామెంట్స్ చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయగా.. భారీ బడ్జెట్ తో 
రామ్ చరణ్ నిర్మించారు.

'చే గువేరా' పేరు చెప్పగానే నా తమ్ముడు పవన్ గుర్తొచ్చాడు.. చిరంజీవి!

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేకపోయింది. బయ్యర్లు కూడా ఈ సినిమా వలన కొంతమేరకు నష్టపోయారని సమాచారం. అయితే చిత్రబృందం ఈ సినిమాని హిట్ అనే చెప్పుకుంటూ వచ్చింది. తాజాగా ఈ సినిమాపై నటుడు గిరిబాబు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

చిరంజీవి తను కలిసి చాలా సినిమాలు చేశామని.. ఇప్పటికీ తన తమ్ముడిలానే చిరంజీవి ప్రవర్తిస్తుంటాడని.. ఎక్కడైనా కనిపిస్తే ఆత్మీయంగా పలకరిస్తాడని తెలిపారు. ఇటీవలే చిరు నటించిన 'సైరా' సినిమా చూశానని.. అధ్బుతమైన సినిమా తీసినట్లు చిరుకి చెప్పానని.. కానీ స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తరువాత సినిమా తీశాం కాబట్టి అది ఇప్పటి 
జెనరేషన్ కి పెద్దగా ఎక్కదని.. ఇప్పుడు స్వాతంత్య్ర వీరులు, పోరాటాలు అంటే యూత్ చూడరని చిరంజీవికి ముందే చెప్పినట్లు వెల్లడించారు. 

అలాగే అప్పట్లో భగత్ సింగ్, గాంధీ, అల్లూరిపై సినిమాలు తీస్తే ఆడాయని, ఎందుకంటే అప్పటి తరానికి అది కనెక్ట్ అయిందన్నారు గిరిబాబు. కానీ మూడు జనరేషన్లు మారిపోయిన తర్వాత ఇప్పుడింకా స్వాతంత్య్ర పోరాటం అంటే కుర్రాళ్లు చూడరని అన్నారు. అయితే ఇదంతా విని...చిరంజీవికి తనకు మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ అనుకుంటారేమో అని , అలాంటిదేమీ లేదని, చిరంజీవితో ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పడం తనకు అలవాటంటున్నారు గిరిబాబు.

ఇప్పటి ఆడియన్స్ కి కనెక్ట్  అయ్యేలా సినిమాలు తీయాలంటే.. ట్రెండింగ్ టాపిక్ తీసుకోవాలని.. పాకిస్తాన్ పై యుద్ధం అంటే సినిమా చూస్తారు కానీ స్వాతంత్య్రం అంటే చూడరని అన్నారు. 'బాహుబలి' లాంటి సినిమాలు తీస్తే చూస్తారని.. అవి కొత్తగా ఉంటాయని అన్నారు. 

click me!