పవన్ రీ ఎంట్రీ ట్విస్ట్.. మూడు గంటలే?

By AN TeluguFirst Published Nov 4, 2019, 10:40 AM IST
Highlights

అయితే రాజకీయాలు ప్రక్కన పెట్టి పవన్ సినిమాలు చేస్తాడా అని అందరులోనూ కలుగుతున్న ప్రశ్న. ఎందుకంటే పార్టీ నిలబడాలంటే.. పూర్తి సమయాన్ని రాజకీయాల కోసమే కేటాయించాలి. 

ఇక పవన్‌ కల్యాణ్‌ సినిమాలు ఆపేసారు, ఫుల్ స్టాఫ్ పెట్టేసినట్లే? అని దాదాపు అందరూ అనుకుంటున్న టైమ్ లో ఓ వార్త తెరమీదకు వచ్చింది. హిందీ హిట్‌ చిత్రం ‘పింక్‌’ తెలుగు రీమేక్‌లో ఆయన నటించబోతున్నారని, ఇది అఫీషియల్ న్యూస్ ప్రచారం జరుగుతోంది. గత ఏడాది ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత పవన్‌ కల్యాణ్‌ మరో సినిమాలో చేయలేదు.  కొన్నాళ్లుగా మేకప్ కి దూరమై రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ పొలిటికల్ పనులతో  బిజీగా ఉంటూనే ఇప్పుడు సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా చెప్తున్నారు.

గతంలో  పవన్ కళ్యాణ్ కొంతమంది దగ్గర తీసుకున్న అడ్వాన్స్ ల కోసమే సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడంటున్నారు. కారణం ఏదైనా రీఎంట్రీ షురూ అయ్యిందని చెప్తున్నారు.
అయితే రాజకీయాలు ప్రక్కన పెట్టి పవన్ సినిమాలు చేస్తాడా అని అందరులోనూ కలుగుతున్న ప్రశ్న. ఎందుకంటే పార్టీ నిలబడాలంటే.. పూర్తి సమయాన్ని రాజకీయాల కోసమే కేటాయించాలి. అందుకోసం  పవన్ కళ్యాణ్ కి డబ్బు కూడా అవసరమే. అందుకే అటు రాజకీయాలను ఇటు సినిమాలను బ్యాలెన్స్ చెయ్యాలనే నిర్ణయానికొచ్చారని చెప్తున్నారు.

వాళ్ళిద్దరిని కలిపిన త్రివిక్రమ్.. పవన్ 'పింక్' రీమేక్.. తెరవెనుక జరిగింది ఇదీ!

కానీ అలా చేయటం సాధ్యమైనా... వాస్తవానికి  రాజకీయాలతో పాటు సినిమాలంటే కుదిరేపని కాదు. గతంలో నందమూరి తారకరామారావు చేసినప్పటి పరిస్దితులు వేరు. కానీ పవన్ కళ్యాణ్ అందుకోసం ఓ తెలివైన ప్లాన్ చేసాడంటున్నారు. తన టైమ్ ని ప్లానింగ్ గా డివైడ్ చేసి, సినిమాల కోసం కాస్త సమయం కేటాయించాలని డిసైడ్ అయ్యి ఈ రీ ఎంట్రీ ప్లాన్స్ చేసారట.

మీడియాలో ప్రచారం దాని ప్రకారం... సినిమాల కోసం రోజుకి కేవలం మూడు గంటల సమయమే దర్శకనిర్మాతలకు ఇవ్వబోతున్నాడట పవన్. అంటే పవన్ కళ్యాణ్ రోజుకి కేవలం మూడు గంటల పాటే మేకప్ వేసుకుంటారని అర్దమవుతోంది. మూడు గంటల తర్వాత సినిమా షూటింగ్స్ కి ప్యాకప్ చెప్పేసి.. రాజకీయాలతో పవన్ బిజీ అవుతాడని చెప్తున్నారు. అయితే ఇది అనుకున్నంత, ఇక్కడ రాసినంత ఈజీమాత్రం కాదు. అలా చేస్తే నిర్మాతలకు బడ్జెట్ తడిసి మోపెడు అవుతుంది. అందుకు ప్రొడ్యూసర్స్ ఒప్పుకుంటారు. వర్కవుట్ అవుతుందా..ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.  

హిందీ ‘పింక్‌’ని తమిళంలో అజిత్‌తో ‘నేర్కొండ పార్వై’గా రీమేక్‌ చేసిన బోనీకపూరే తెలుగు రీమేక్‌ను నిర్మించబోతున్నారు. ‘దిల్‌’ రాజు మరో నిర్మాత. ‘ఓ.. మై ఫ్రెండ్, ఎమ్‌సీఏ (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి)’ చిత్రాల ఫేమ్‌ వేణు శ్రీరామ్‌ ఈ సినిమాకు దర్శకుడు.

click me!