Sarileru Neekevvaru: మహేష్ బాబు రెమ్యునరేషన్ లో కోత!

By AN Telugu  |  First Published Nov 22, 2019, 4:28 PM IST

తన వాటాగా మహేష్ బాబుకి నాన్ థియేట్రికల్ రైట్స్ ఇవ్వడానికి నిర్మాత అనీల్ సుంకర అంగీకరించడంతో ఆ రైట్స్ విలువ యాభై రెండు కోట్లని అంచనా వేశారు. అయితే ఈ సినిమాకి నాన్ థియేట్రికల్ రైట్స్ అంచనా వేసినంత రేంజ్ లో రావడం లేదని సమాచారం. 


సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి గాను మహేష్ బాబుకి యాభై కోట్ల రూపాయల పారితోషికం వస్తుందనే ప్రచారం జరిగింది. తన వాటాగా మహేష్ బాబుకి నాన్ థియేట్రికల్ రైట్స్ ఇవ్వడానికి నిర్మాత అనీల్ సుంకర అంగీకరించడంతో ఆ రైట్స్ విలువ యాభై రెండు కోట్లని అంచనా వేశారు.

మహేష్, బన్నీ సంక్రాంతి ఫైట్ : భయపడ్డారా..? రాజీ పడ్డారా..?

Latest Videos

అయితే ఈ సినిమాకి నాన్ థియేట్రికల్ రైట్స్ అంచనా వేసినంత రేంజ్ లో రావడం లేదని సమాచారం. హిందీ డబ్బింగ్ రైట్స్ లోనే అంచనా వేసుకున్న దానికంటే కనీసం ఏడు కోట్లు తక్కువ పలికిందట. అలానే ఇతర హక్కుల పరంగా కూడా మునుపటి ధరలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని టాక్.

థియేట్రికల్ రైట్స్ నుండి నిర్మాతకి మిగిలే లాభాలు కూడా పెద్దగా ఉండవని చెబుతున్నారు. ఈ సినిమా మేకింగ్ కోసమే యాభై కోట్లు అనుకున్నారు. కానీ తీరా సెట్స్ పైకి వెళ్లిన తరువాత ఖర్చు విపరీతంగా పెరిగిపోవడంతో అనుకున్న బడ్జెట్ దాటేసింది. దీంతో మహేష్ కి వస్తుందని అంచనా వేసిన మొత్తం యాభై రెండు కోట్లయితే.. ఇప్పుడు కచ్చితంగా ఇవ్వలేరని సమాచారం.

చేసుకున్న ఒప్పందం ప్రకారం నాన్ థియేట్రికల్ రైట్స్ ఎంత వస్తే అంత మహేష్ కి వెళ్తుంది కనుక మారిన మార్కెట్ పరిణామాల బట్టి చూస్తుంటే మహేష్ కి వచ్చే పారితోషికంలో కోత పడుతుందనే చెప్పాలి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫైనల్ చేస్తూ అధికార ప్రకటన వచ్చింది.

జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి కాసేపట్లో టీజర్ ని కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా.. విజయశాంతి, ప్రకాష్ రాజ్ లాంటి నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

click me!