ప్రభాస్ ని మళ్లీ వాడేసాడే,కటౌట్ కే కౌంటర్

Published : May 13, 2023, 07:02 AM IST
 ప్రభాస్ ని మళ్లీ వాడేసాడే,కటౌట్ కే కౌంటర్

సారాంశం

మా మధ్య ఉన్నది అభిమాని, స్టార్ మధ్య ఉన్న బంధం. ప్రభాస్ అన్న ప్రేమ దక్కినందుకు నేను ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి అని చెప్పుకొచ్చాడు.  


 పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి వంటి చిత్రాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు సంతోష్ శోభన్. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు ఈ కుర్ర హీరో. అయితే సక్సెస్ మాత్రం రావటం లేదు. సంతోష్ శోభన్ వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. రీసెంట్ గా ‘కళ్యాణం కమనీయం’, ‘శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఈ రెండు సినిమాలు ఆడియెన్స్ ను పెద్దగా అలరించలేకపోయాయి. అయినా, హిట్, ఫట్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు.  సంతోష్ ని ఇండస్ట్రీ లో ఎక్కువ సపోర్ట్ చేస్తోంది ఎవరూ అంటే ప్రభాస్. తన బ్యానర్ పై సంతోష్ హీరోగా సినిమాలు చేస్తున్నారు. అలాగే సంతోష్ సినిమాలకు సపోర్ట్ చేస్తున్నారు. సంతోష్ తండ్రి శోభన్ ..దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం పెద్ద హిట్. 

తన తొలి బ్లాక్ బస్టర్ ఆ చిత్రం కావటంతో ఆయన కుమారుడు సంతోష్ కు తనకు చేతనైన మేరకు సాయం చేస్తూ వస్తున్నారు. సంతోష్ కూడా ప్రభాస్ ప్రస్తావన ఎక్కడో చోట తెస్తున్నారు. తాజాగా సంతోష్ నటిస్తున్న సినిమా ‘అన్నీ మంచి శకునములే’. ‘సీతారామం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను నిర్మించిన వైజయంతి మూవీస్ కు చెందిన స్వప్న సినిమా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.   ఈ ట్రైలర్ చివరిలో ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అంటూ సంతోష్ శోభన్ .. ప్రభాస్ డైలాగ్ చెప్పడం.. ట్రైలర్ మొత్తానికి మంచి హై ఇచ్చినట్టైంది.నువ్వు కటౌట్ వే కానీ ప్రభాస్ వి కావు అని కౌంటర్ ఇస్తుంది. 

 

 సంతోష్ మాట్లాడుతూ..ప్రభాస్ అన్న నాకు ఇచ్చే సపోర్ట్ గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఆయన ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్. నా గత చిత్రాల ప్రమోషన్ కు సపోర్ట్ చేశారు.  నేను ఆయన అభిమానిని. మా మధ్య ఉన్నది అభిమాని, స్టార్ మధ్య ఉన్న బంధం. ప్రభాస్ అన్న ప్రేమ దక్కినందుకు నేను ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి అని చెప్పుకొచ్చాడు.

  ‘అన్నీ మంచి శకునములే’ సినిమా ట్రైలర్  బాగా ఆకట్టుకుంటోందని చెప్పాలి చూస్తున్నంత సేపు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తోంది.  ఈ సినిమాలో సంతోష్ శోభన్ సరసన మాళవికా నాయర్ ఫెరఫెక్ట్.  రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి, వాసుకి, వెన్నెల కిషోర్, రమ్య సుబ్రమణియన్, అంజు ఆల్వా నాయక్, అశ్విన్ కుమార్ సహా పలువురు నటీనటులు ఇందులో నటించారు.  మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. లక్ష్మీ భూపాల మాటలు అందించారు. సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. జునైద్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  ఈ వేసవిలో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?