కాకతాళీయమైనా 'సరిలేరు..', 'అల..' ఒకే పోలిక!

By AN TeluguFirst Published Jan 8, 2020, 9:41 AM IST
Highlights

లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయ శాంతి ..దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత తెరపై కనిపించనున్నారు. ఆమె నటించిన ఆఖరి చిత్రం 2006 విడుదలైన నాయుడమ్మ. 

గత సంక్రాంతి మాదిరే ఈ సారి కూడా నాలుగు సినిమాలు వస్తున్నాయి.  ఈ సంక్రాంతికి సంక్రాంతికి అల్లు అర్జున్, మహేష్ బాబు, కళ్యాణ్ రామ్, రజనీకాంత్ రచ్చ చేయనున్నారు. రేపటి నుంచి అంటే జనవరి 9 నుంచి ఈ జోరు మొదలవుతుంది. అన్నింటిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రధానంగా రెండు సినిమాల మధ్యే పోటీ ఉందని అందరికీ తెలుసు. అవే సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో.... ఈ రెండు సినిమాలతో ఇద్దరు సీనియర్ నటీమణులు చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇస్తూండటం గమనార్హం.

లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయ శాంతి ..దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత తెరపై కనిపించనున్నారు. ఆమె నటించిన ఆఖరి చిత్రం 2006 విడుదలైన నాయుడమ్మ. అలాగే టబు ..దాదాపు 11 సంవత్సరాల తర్వాత తెలుగులో కనిపించబోతోంది. 2008లో వచ్చిన పాండురంగడు తర్వాత ఆమె మళ్లీ తెలుగులో కనిపించలేదు.  వీళ్లిద్దరూ తమ రీఎంట్రీపై చాలా నమ్మకంగా ఉన్నారు.

'అల వైకుంఠపురములో' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2000లో వీళ్లిద్దరూ నెంబర్ వన్ గా వెలుగుతున్న నటీమణులు కావటం చెప్పుకోదగ్గ విషయం. కాకతాళీయంగానే వీళ్లిద్దరి రీఎంట్రీ జరుగుతున్నా...సినీ లవర్స్ లో ఓ విధమైన ఆసక్తి నెలకొంది అనటంలో సందేహం లేదు.
 
ఇక ఇప్పటికే ఈ రెండు సినిమాలు ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి. సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమయ్యాయి. రెండు సినిమాలు ఏ కట్స్ లేకుండా యుఎ సర్టిఫికేట్ తెచ్చుకున్నాయి. అదే సమయంలో రెండు సినిమాలకు రన్ టైమ్ ఎక్కువ ఉండటం గమనించదగ్గ విషయం.  సరిలేరు నీకెవ్వరు చిత్రం 169 నిముషాలు. అలాగే అలవైకుంఠపురం కూడా 165 నిముషాలు.
 

click me!