శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: ఆసుపత్రిలో చేరిన సంజయ్ దత్

Published : Aug 09, 2020, 07:10 AM IST
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: ఆసుపత్రిలో చేరిన సంజయ్ దత్

సారాంశం

ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని చెప్పడంతో సంజయ్ దత్ ని ఆసుపత్రికి తరలించామని, పరిస్థితి ఇప్పుడు మామూలుగానే ఉందని, సోమవారం డిశ్చార్జ్ అవ్వొచ్చని సంజయ్ సోదరి ప్రియా దత్ తెలిపింది. 

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతుండడంతో.... సంజయ్ దత్ ని హుటాహుటిన ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. 

కొద్దిగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని చెప్పడంతో సంజయ్ దత్ ని ఆసుపత్రికి తరలించామని, పరిస్థితి ఇప్పుడు మామూలుగానే ఉందని, సోమవారం డిశ్చార్జ్ అవ్వొచ్చని సంజయ్ సోదరి ప్రియా దత్ తెలిపింది. 

మెడికల్ ఆబ్సెర్వేషన్స్లో సంజయ్ ఉన్నట్టుగా ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా ఆరోగ్యకరంగా ఉందని కరోనా వైరస్ రిపోర్ట్ కూడా నెగటివ్ గా వచ్చినట్టు వైద్యులు తెలిపారు. 

ఇదే విషయాన్నీ ధృవీకరిస్తూ సంజయ్ దత్ ట్వీట్ చేసారు. తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, కోవిడ్ రిపోర్ట్ కూడా నెగటివ్ గా వచ్చిందని తెలిపాడు. లీలావతి హాస్పిటల్ డాక్టర్లు, నర్సులు, స్టాఫ్ సహకారంతో ఒకటి రెండు రోజుల్లో తాను బయటకు వస్తానని ట్వీట్ చేసాడు 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?