హత్యాచార ఘటనపై దర్శకుడి కామెంట్.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

By AN TeluguFirst Published Dec 2, 2019, 4:29 PM IST
Highlights

మహిళలను హింసించే విధంగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' రెండు సినిమాలను రూపొందించిన దర్శకుడు 
సందీప్ రెడ్డిపై మహిళావాదులు తీవ్ర విమర్శలు చేశారు.

'అర్జున్ రెడ్డి' సినిమా తెలుగులో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. విజయ్ దేవరకొండ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాని సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేశారు. తెలుగులో సక్సెస్ అయిన ఈ సినిమాని హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశారు.

షాహిద్ కపూర్, కియారా నటించినఈ సినిమా అక్కడ కూడా పెద్ద హిట్. ఎంత పెద్ద సక్సెస్ అయిందో అదే స్థాయిలో సినిమాపై విమర్శలు కూడా వచ్చాయి. మహిళలను హింసించే విధంగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయంటూ చాలా మంది కామెంట్స్ చేశారు.

'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' రెండు సినిమాలను రూపొందించిన దర్శకుడు సందీప్ రెడ్డిపై మహిళావాదులు తీవ్ర విమర్శలు చేశారు. ఇది ఇలా ఉండగా.. ఇటీవల హైదరాబాద్ లో వైద్యురాలిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆ తరువాత ఆమెని హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు స్పందిస్తున్నారు.

నన్ను ముద్దు పెట్టుకున్నాడని ఎలా నిరూపించాలి.. చిన్మయి ఆవేదన!

ఈ క్రమంలో దర్శకుడు సందీప్ రెడ్డి కూడా స్పందించాడు. ''సమాజంలో ఇలాంటి దారుణ ఘటనలను ఆపాలంటే భయం ఒక్కటే మార్గం. దోషులను కఠినంగా శిక్షిస్తే.. ఇలాంటి ఆలోచనలు చేయడానికే వణుకు పుడుతుంది. దేశంలోని ప్రతీ అమ్మాయికీ భరోసా కల్పించాలి'' అని ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ పై కొందరు నెటిజన్లతో సహా ప్రముఖులు కూడా విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య.. 'కబీర్ సింగ్' లోని ఓ సన్నివేశాన్ని ఉద్దేశిస్తూ సందీప్ కి చురకలు అంటించారు. 'మీరు చెబుతున్న ఆ భయం.. మీ సినిమాలో ఆమె(హీరోయిన్)ని కొట్టకుండా ఆపగలిగిందా..?' అని కామెంట్స్ చేశారు.

అలానే కొందరు నెటిజన్లు 'మహిళలపై హింసను ప్రేరేపించేలా కాకుండా మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నించండి' అంటూ ఆయనకి సూచనలు చేస్తున్నారు. మరి ఈ  ట్వీట్లపై సందీప్ రెడ్డి స్పందిస్తాడేమో చూడాలి!

 

Will that FEAR stop them from slapping her? https://t.co/dgOIHyTWlU

— Vikramaditya Motwane (@VikramMotwane)
click me!