సమంత - శర్వానంద్ సర్ ప్రైజ్ లవ్ టీజర్

By Prashanth MFirst Published Jan 8, 2020, 3:36 PM IST
Highlights

96 కంటెంట్ ఎంతగా క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమాకు సంబందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అండ్  సాంగ్స్ జనాలను ఇంకా ఆకట్టుకొంటూనే ఉన్నాయి. 

96 సినిమా టీవీల్లో ప్రదర్శించినప్పటికీ తమిళనాడులోని కొన్ని ఏరియాల్లో హౌజ్ ఫుల్ థియేటర్స్ తో కొనసాగింది అంటే.. కంటెంట్ ఎంతగా క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమాకు సంబందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ జనాలను ఇంకా ఆకట్టుకొంటూనే ఉన్నాయి.  కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న లవ్ స్టోరీ 96 సినిమా తెలుగులో రీమేక్ కాబోతున్న విషయం తెలిసిందే.

అయితే నేడు సినిమాకు సంబందించిన స్పెషల్ అప్డేత్ వైరల్ అవుతోంది.  సమంతా శర్వానంద్ జంటగా నటించిన ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ సర్ ప్రైజ్ రాబోతోందట.  సినిమా టైటిల్ పై అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్న తరుణంలో సినిమా అసలైన టైటిల్ జాను అని క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ లుక్ లో శర్వా ఎడారిలో కెమెరా పట్టుకొని ఓ బాటసారి లా కనిపిస్తునాడు.

96 రీమేక్ ఫస్ట్ లుక్.. ఎడారిలో ఒంటరిగా శర్వా

సమంతా హీరోయిన్ గా  నటిస్తున్న ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. కోలీవుడ్ 96 కథలో త్రిషా విజయ్ సేతుపతి నటించిన సంగతి తెలిసిందే.  ఇక టీజర్ ని గురువారం సాయంత్రం 5గంటలకు రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమంత - శర్వాలకు సంబందించిన ఒక క్యూట్ విజువల్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే  సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యింది.

దాదాపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎండింగ్ కి వచ్చేశాయి. ఈ లవ్ స్టోరీ తెలుగు ఆడియెన్స్ కి కూడా నచ్చుతుందని నిర్మాత దిల్ రాజు పట్టుబట్టి కథను రీమేక్ చేస్తున్నాడు. ఒరిజినల్ కథకు రీమేక్ కు ఏ మాత్రం తేడా రావద్దని  ఒరిజినల్ తమిళ్ దర్శకుడైన సి.ప్రేమ్ కుమార్ ని ఎంచుకున్నాడు. మరి సినిమా దిల్ రాజు ఆశించిన స్థాయిలో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

click me!