కాలినడకన ఏడు కొండలు ఎక్కిన సమంత.. శ్రీవారి దర్శనం కోసం..

Published : Dec 19, 2019, 09:51 PM ISTUpdated : Dec 20, 2019, 10:57 AM IST
కాలినడకన ఏడు కొండలు ఎక్కిన సమంత.. శ్రీవారి దర్శనం కోసం..

సారాంశం

సమంత అక్కినేని టాలీవుడ్ లో తిరుగులేని స్టార్. ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్లలో సమంత అగ్రస్థానంలో ఉంటుంది. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో కూడా సమంత ఒదిగిపోయి నటిస్తుంది.

సమంత అక్కినేని టాలీవుడ్ లో తిరుగులేని స్టార్. ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్లలో సమంత అగ్రస్థానంలో ఉంటుంది. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో కూడా సమంత ఒదిగిపోయి నటిస్తుంది. అక్కినేని వారి కోడలయ్యాక కూడా సమంత నటనని కొనసాగిస్తోంది. 

ఇటీవల కాలంలో సమంత నుంచి రంగస్థలం, మహానటి, ఓ బేబీ, మజిలీ లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సమంత శర్వానంద్ సరసన 96 చిత్రం తెలుగు రీమేక్ లో నటిస్తోంది. 

తాజాగా సమంత కాలినడకన తిరుమలకు వెళ్ళింది. శ్రీవారి దర్శనం కోసం సమంత కాలినడకన ఏడు కొండలు ఎక్కింది. బుధవారం రాత్రి సమంత అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమల చేరుకుంది. సమంతతో పాటు ఆమె స్నేహితురాలు, తమిళ నటి రమ్య సుబ్రహ్మణ్యం కూడా తిరుమలకు నడచి వెళ్లారు. 

మార్గ మధ్యంలో సమంతని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. అడిగిన వారికీ కాదనకుండా సమంత సెల్ఫీలకు ఫోజులు ఇస్తూ వెళ్లారు. ఈ నేపథ్యంలో స్వల్పంగా జనాల మధ్య తొక్కిసలాట జరిగింది. దీనిపై సమంత ఫన్నీగా కామెంట్ చేసింది. మీ కాళ్ళు తొక్కారు.. నా కాళ్ళు తొక్కి నుంటే పచ్చడి అయిపోయేవి అని అక్కడున్న ప్రజలతో సమంత ఫన్నీగా కామెంట్ చేసింది. 

 

రమ్యతో కలసి ఉత్సాహంగా సమంత తిరుమల చేరుకుంది. అనంతరం ఇద్దరూ కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగిందని రమ్య సోషల్ మీడియాలో పేర్కొంది. సమంతతో తిరుమలకు నడచి వెళుతున్న ఫోటోలని షేర్ చేసింది. 

మజిలీ చిత్రం రిలీజ్ కు ముందు, ఓ బేబీ రిలీజ్ కు ముందు సమంత కాలినడకన తిరుమలకు వెళ్లారు. గత 8 నెలల్లో సమంత మూడవసారి తిరుమలకు కాలినడకన వెళ్లారు. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?