రొమాంటిక్ సాంగ్.. నాగశౌర్య, మెహ్రీన్ కెమిస్ట్రీ చూశారా!

Published : Dec 19, 2019, 08:22 PM IST
రొమాంటిక్ సాంగ్.. నాగశౌర్య, మెహ్రీన్ కెమిస్ట్రీ చూశారా!

సారాంశం

యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం అశ్వథ్థామ. రమణ తేజ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగశౌర్య, మెహ్రీన్ జంటగా నటిస్తున్నారు. జ్యోఅచ్యుతానంద, ఛలో లాంటి హిట్ చిత్రాలు పడడంతో నాగశౌర్యకు యువతలో మంచి క్రేజ్ ఏర్పడింది.

యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం అశ్వథ్థామ. రమణ తేజ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగశౌర్య, మెహ్రీన్ జంటగా నటిస్తున్నారు. జ్యోఅచ్యుతానంద, ఛలో లాంటి హిట్ చిత్రాలు పడడంతో నాగశౌర్యకు యువతలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఛలో తర్వాత ఈ కుర్ర హీరోకు ఆ స్థాయి సక్సెస్ మాత్రం దక్కలేదు. 

ప్రస్తుతం తెరకెక్కుతున్న అశ్వథ్థామ చిత్రంపైనే ఈ యంగ్ హీరో ఆశలన్నీ పెట్టుకుని ఉన్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి నిన్నే నిన్నే అనే సాంగ్ ని విడుదల చేశారు. ఏ లిరికల్ వీడియోలో సాంగ్ కి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ కూడా చూపించారు. 

నాగశౌర్య, మెహ్రీన్ జంట అద్భుతమైన కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోంది. పాట కూడా వినసొంపుగా ఉంది. పాటలోని ఎమోషన్ కు తగ్గట్లుగా నాగశౌర్య, మెహ్రీన్ జంట రొమాన్స్ తో అదరగొడుతున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. 

నాగబాబు 'అదిరింది' షో.. జబర్దస్త్ కు డూప్లికేట్ అనిపిస్తోందిగా!

రమేష్ వాకచర్ల ఈ సాంగ్ కు సాహిత్యం అందించారు. అర్మాన్ మాలిక్, యామిని గంటసాల ఈ పాటకు అద్భుతమైన గాత్రాన్ని అందించారు. మెహ్రీన్ కెరీర్ కు కూడా ఈ చిత్రం చాలా కీలకం. ఎందుకంటే గత ఏడాది నుంచి మెహ్రీన్ కు ఎఫ్2 మినహా సరైన హిట్ లేదు. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?