'ప్రతిరోజూ పండగే' ఫస్ట్ డే కలెక్షన్స్.. మంచి వసూళ్లే.. కానీ!

By tirumala ANFirst Published Dec 21, 2019, 12:28 PM IST
Highlights

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతిరోజూ పండగే. డైరెక్టర్ మారుతీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్రలహరి ముందు వరకు సాయిధరమ్ తేజ్ వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు.

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతిరోజూ పండగే. డైరెక్టర్ మారుతీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్రలహరి ముందు వరకు సాయిధరమ్ తేజ్ వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు. తప్పనిసరిగా  తేజు హిట్ కొట్టాలని భావిస్తున్న తరుణంలో చిత్రలహరి చిత్రం మంచి విజయం సాధించింది. 

దీనితో తేజకు మరోమారు కెరీర్ పరంగా పుంజుకునే అవకాశం దక్కింది. చిత్రలహరి తర్వాత మారుతి చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో తేజు  ప్రతిరోజూ పండగే చిత్రాన్ని ఓకే చెప్పాడు. సాయిధరమ్ తేజ్ సరసన ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. ప్రతిరోజూ పండగే చిత్రంపై మొదటి నుంచి మంచి బజ్ నెలకొని ఉంది. 

డిసెంబర్ 20న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. తొలి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలయింది. ఫిలిం క్రిటిక్స్ కూడా ప్రతిరోజూ పండగే చిత్రానికి మంచి రివ్యూలు ఇచ్చారు. 

కాగా ప్రతిరోజూ పండగే చిత్ర తొలి రోజు వసూళ్ల వివరాలు వచ్చాయి. తొలి రోజు ప్రతి రోజూ పండగే చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ 3.13 కోట్ల షేర్ రాబట్టింది. ఇవి మంచి ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ పండగే చిత్రం 4  కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఈ చిత్ర గ్రాస్ కలెక్షన్స్ విలువ వరల్డ్ వైడ్ గా 7 కోట్ల వరకు నమోదయ్యాయి. 

నైజాంలో తొలిరోజు ఈ చిత్రం 1.25 కోట్ల షేర్ రాబట్టింది. ఈ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్ సేవ్ కావాలంటే ఫుల్ రన్ లో ఈ చిత్రం 5.5 కోట్ల వరకు షేర్ రాబట్టాలి. ఇక ఉత్తరాంధ్రలో 33 లక్షలు, సీడెడ్ లో 34 లక్షలు, ఈస్ట్ లో 30, వెస్ట్ లో 22, గుంటూరులో 30, కృష్ణలో 21 లక్షల షేర్ ని మొదటి రోజు ఈ చిత్రం సాధించింది. ప్రతిరోజూ పండగే చిత్రం సాధించిన ఈ కల్లెక్షన్స్.. తేజు గత చిత్రానికి దాదాపుగా సమానంగా ఉన్నాయి. చిత్రలహరి చిత్రం తొలి రోజు 3 కోట్ల వరకు షేర్ రాబట్టింది. 

జూ.ఎన్టీఆర్ పైనే ఆశలు.. అప్పుడైనా జోరు పెరుగుతుందా!

ప్రతిరోజూ పండగే చిత్రానికి తొలి రోజు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. కానీ ఈ చిత్రాన్ని థియేట్రికల్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 16  కోట్ల వరకు జరిగింది. ఆ మొత్తం రాబట్టాలంటే రానున్న రోజుల్లో కలెక్షన్స్ పుంజుకోవాలి. చిత్రానికి హిట్  రావడంతో వీకెండ్ వసూళ్లు అధికంగా ఉంటాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

click me!