మహేష్ నెక్స్ట్ 4 ప్రాజెక్ట్స్.. క్యూలో టాప్ డైరెక్టర్స్!

prashanth musti   | Asianet News
Published : Feb 08, 2020, 01:58 PM IST
మహేష్ నెక్స్ట్ 4 ప్రాజెక్ట్స్.. క్యూలో టాప్ డైరెక్టర్స్!

సారాంశం

2020ని సాలిడ్ గా స్టార్ట్ చేసిన మహేష్ ఫైనల్ గా మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. ఇక చిత్ర యూనిట్ వరుసగా సక్సెస్ సెలబ్రేషన్స్ తో సినిమాపై మరీంత బజ్ క్రియేట్ చేయడంతో బయ్యర్స్ సేఫ్ జోన్ లోకి వచ్చేశారు.

సరిలేరు నీకెవ్వరు! అంటూ 2020ని సాలిడ్ గా స్టార్ట్ చేసిన మహేష్ ఫైనల్ గా మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. ఇక చిత్ర యూనిట్ వరుసగా సక్సెస్ సెలబ్రేషన్స్ తో సినిమాపై మరీంత బజ్ క్రియేట్ చేయడంతో బయ్యర్స్ సేఫ్ జోన్ లోకి వచ్చేశారు.

ఇకపోతే మహేష్ నెక్స్ట్ మహర్షి సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్టిచ్చిన డైరెక్టర్ వంశీ పైడిపల్లితో వర్క్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో మహేష్ ఒక స్పైగా కనిపించబోతున్నాడట. ఇప్పటికే ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్న దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెట్టేసాడు. ఆ సినిమా తరువాత మహేష్ వెంటనే మరో రెండు ప్రాజెక్టులను సెట్స్ పైకి తేవాలని ట్రై చేస్తున్నాడు.

మహేష్ 28వ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది.  ఇక ఆ తరువాత అనిల్ రావిపూడితో కూడా మరో సినిమా చేయనున్నాడు. 30వ సినిమాని కొరటాల శివ డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం. వరుసగా నెక్స్ట్ 2, 3 ఇయర్స్ మహేష్ టాలీవుడ్ స్టార్ దర్శకులను ముందే బుక్ చేసుకున్నాడు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా మహేష్ చేసుకుంటున్న ఈ ప్లాన్ తో ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. మరీ ఆ సినిమాలతో సూపర్ స్టార్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటారో చూడాలి.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?